తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక: దూసుకొస్తున్న వాయు‘గండం’

మొన్నటి దాకా ఎండలతో ఉడికిపోగా.. ఇప్పుడు వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. గత రెండు మూడు రోజులుగా వర్షాలు పడుతూనే ఉంటున్నాయి. తాజాగా.. ఏపీ విపత్తు నిర్వహణ శాఖ పలు వివరాలు వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. భారత వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు రాబోయే 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెబుతోంది. Also Read: తెలంగాణ గ్రామీణం అతలాకుతలం..! ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ […]

Written By: NARESH, Updated On : October 12, 2020 4:23 pm
Follow us on

మొన్నటి దాకా ఎండలతో ఉడికిపోగా.. ఇప్పుడు వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. గత రెండు మూడు రోజులుగా వర్షాలు పడుతూనే ఉంటున్నాయి. తాజాగా.. ఏపీ విపత్తు నిర్వహణ శాఖ పలు వివరాలు వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. భారత వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు రాబోయే 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెబుతోంది.

Also Read: తెలంగాణ గ్రామీణం అతలాకుతలం..!

ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కోస్తా ఆంధ్ర తీరానికి సమీపంలోకి వస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖపట్టణానికి ఆగ్నేయ దిశగా 280 కిలోమీటర్లు, కాకినాడకు తూర్పు ఆగ్నేయ దిశగా 320 కిలోమీటర్లు, నర్సాపూర్‌‌కు తూర్పు ఆగ్నేయ దిశగా 360 కి.మీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపింది.

పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపూర్‌‌–విశాఖపట్నం మధ్య కాకినాడకు సమీపంలో మంగళవారం తీరం దాటే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, ఉభయగోదావరి జిల్లాల్లో చాలాచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 24 గంటల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: ఎంసెట్‌ ఆప్షన్ల నమోదులో అందుకే ఆలస్యం

భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్‌ అయింది. తీరప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ కమిషనర్‌‌ కన్నబాబు సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని పేర్కొన్నారు.