https://oktelugu.com/

పూరి-నాగార్జున హాట్రిక్ కొడుతారా?

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్మాథ్.. కింగ్ నాగార్జున కాంబినేషన్ మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో  ‘శివమణి’.. ‘సూపర్’ మూవీలు వచ్చాయి. ‘శివమణి’ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలువగా.. సూపర్ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. చాలా గ్యాప్ తర్వాత వీరిద్దరు హట్రిక్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు ఫిల్మ్ నగర్లో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ‘ఫైటర్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో విజయ్ దేవరకొండ, అనన్యపాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్యాన్ ఇండియా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 12, 2020 / 03:51 PM IST
    Follow us on

    డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్మాథ్.. కింగ్ నాగార్జున కాంబినేషన్ మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో  ‘శివమణి’.. ‘సూపర్’ మూవీలు వచ్చాయి. ‘శివమణి’ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలువగా.. సూపర్ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. చాలా గ్యాప్ తర్వాత వీరిద్దరు హట్రిక్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు ఫిల్మ్ నగర్లో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

    ప్రస్తుతం పూరి జగన్నాథ్ ‘ఫైటర్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో విజయ్ దేవరకొండ, అనన్యపాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా ‘పైటర్’ రాబోతుంది. తెలుగులో ఈ మూవీని పూరి-చార్మిలు నిర్మిస్తుండగా.. హిందీ వర్షన్ కి కరణ్ జోహర్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

    ఇక కింగ్ నాగార్జున సైతం ‘వైల్డ్ డాగ్’ మూవీతో బీజీగా ఉన్నాడు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్ గా కన్పించబోతున్నాడు. ఈ మూవీపై అక్కినేని ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ పూర్తయిన వెంటనే నాగార్జున-పూరి కాంబోలో హట్రిక్ మూవీ ఉంటుందని టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా విన్పిస్తోంది.

    శివమణి.. సూపర్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉండనుందని సమాచారం. ఫాంటసీ నేపథ్యంలో ఈ మూవీని తెరక్కించేందుకు దర్శకుడు పూరి జగన్మాథ్ ఇప్పటికే కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘నాపేరు శివమణి.. నాకొంచెం మెటల్’ అంటూ నాగార్జునతో పూరి చెప్పించిన డైలాగ్ ఇప్పటికీ పాపులరే. ఇక వీరిద్దరి కాంబినేషన్లో హట్రిక్ మూవీ రాబోతుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.