https://oktelugu.com/

కంగనాకు వార్నింగ్.. ‘నడిరోడ్డుపై రేప్ చేస్తా’..!

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కొద్దిరోజులుగా తన సినిమాల కంటే వివాదాస్పద అంశాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కంగనా ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సమాజంలోని సమస్యలపై సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటోంది. ఆమె తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెబుతుండటంపై కంగనాపై విమర్శలు సైతం ఎక్కువగానే వస్తున్నాయి. Also Read: సీఎం కేసీఆర్‌‌ అలా నోరు తెరిచి సాయం ఎందుకు కోరినట్లు..? అయితే కంగనా మాత్రం తనపై వచ్చే విమర్శలను పెద్దగా పట్టించుకోవడం లేదు. తాను చెప్పదలుచుకున్నది […]

Written By:
  • NARESH
  • , Updated On : October 21, 2020 / 01:56 PM IST
    Follow us on

    బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కొద్దిరోజులుగా తన సినిమాల కంటే వివాదాస్పద అంశాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కంగనా ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సమాజంలోని సమస్యలపై సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటోంది. ఆమె తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెబుతుండటంపై కంగనాపై విమర్శలు సైతం ఎక్కువగానే వస్తున్నాయి.

    Also Read: సీఎం కేసీఆర్‌‌ అలా నోరు తెరిచి సాయం ఎందుకు కోరినట్లు..?

    అయితే కంగనా మాత్రం తనపై వచ్చే విమర్శలను పెద్దగా పట్టించుకోవడం లేదు. తాను చెప్పదలుచుకున్నది సోషల్ మీడియాలో చెబుతుండటంతో నెటిజన్లలో ఓవర్గం ఆమెకు వంతపడుతుండగా మరోవర్గం మాత్రం ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఇటీవల ఆమె పలు సమస్యలపై సోషల్ మీడియాలో స్పందించారు.

    హిందూ సాధువులపై దాడులు.. బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య.. ముంబై పోలీసుల నిర్లక్ష్యం.. మహారాష్ట్ర సర్కారు తీరుపై ఆమె స్పందించారు. ఈనేపథ్యంలో కంగనాకు శివసేన నాయకుల మధ్య మాటలయుద్ధం కొనసాగింది. మహారాష్ట్ర సర్కారు పట్టుబట్టి కంగనా నివాసం ఉంటున్న ఇంటిని మున్సిపల్ నిబంధనలు ఉల్లంఘించదంటూ కూల్చివేసిన సంఘటన సంచలనంగా మారింది.

    తాజాగా కంగనాకు సోషల్ మీడియాలో అత్యాచార బెదిరింపులు రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కంగనా రనౌత్ ఇంట్లో పెళ్లి వేడుక జరుగనుంది. తన సోదరుడి పెళ్లి పనుల్లో ఆమె బీజీగా ఉంది. ఇందుకు సంబంధించిన పిక్స్ ఆమె తన ట్వీటర్లో పోస్టు చేసింది. అయితే ఈ ఫొటోలను చూసిన ఓ న్యాయవాది ‘నడిరోడ్డుపై అత్యాచారం చేస్తా’ అంటూ కామెంట్స్ పెట్టాడు. ఈ కామెంట్స్ చూసిన నెటిజన్లు   షాకవుతున్నారు.

    Also Read: పొలిటికల్ హీట్: మరో డిబేట్‌కు ట్రంప్, జోబైడెన్ రెడీ

    సదరు న్యాయవాది మాత్రం తన అకౌంట్ హ్యాక్ అయిందని చెబుతున్నాడు. తనకు మహిళల అంటే చాలా గౌరవం ఉందని.. సమాజం పట్ల బాధ్యత ఉందని చెప్పుకొచ్చాడు. తన అకౌంట్ నుంచి అసభ్యకరంగా పెట్టిన పోస్టుతో ఎవరైనా బాధపడితే క్షమించండి అంటూ కోరాడు. అనంతరం తన ఫేస్ బుక్ అకౌంట్ పూర్తిగా తొలగించాడు. అయితే దీనిపై కంగనా నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడం గమనార్హం.