https://oktelugu.com/

పొలిటికల్ హీట్: మరో డిబేట్‌కు ట్రంప్, జోబైడెన్ రెడీ

అమెరికా ఎన్నికలకు టైం దగ్గరపడుతోంది. దీంతో ఆ దేశంలో ఎన్నికల ప్రచార ర్యాలీలు హోరెత్తిస్తున్నాయి. అభ్యర్థులు పోటాపోటీగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో మునిగిపోయారు. అధికారాన్ని నిలుపుకునేందుకు రిపబ్లికన్ పార్టీ.. ఈ దఫా విజయం సాధించాలని డెమొక్రటిక్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. తాజాగా చేపట్టిన ఐబీడీ/టీఐపీపీ 2020 అధ్యక్ష ఎన్నికల ట్రాకింగ్ పోల్ ప్రకారం.. ట్రంప్ స్వల్పంగా జో బిడెన్‌పై ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ 48.1 శాతం మద్దతును కూడగట్టుకోగా.. జో బిడెన్‌కు ఈ సంఖ్య […]

Written By:
  • NARESH
  • , Updated On : October 21, 2020 / 02:00 PM IST
    Follow us on

    అమెరికా ఎన్నికలకు టైం దగ్గరపడుతోంది. దీంతో ఆ దేశంలో ఎన్నికల ప్రచార ర్యాలీలు హోరెత్తిస్తున్నాయి. అభ్యర్థులు పోటాపోటీగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో మునిగిపోయారు. అధికారాన్ని నిలుపుకునేందుకు రిపబ్లికన్ పార్టీ.. ఈ దఫా విజయం సాధించాలని డెమొక్రటిక్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. తాజాగా చేపట్టిన ఐబీడీ/టీఐపీపీ 2020 అధ్యక్ష ఎన్నికల ట్రాకింగ్ పోల్ ప్రకారం.. ట్రంప్ స్వల్పంగా జో బిడెన్‌పై ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ 48.1 శాతం మద్దతును కూడగట్టుకోగా.. జో బిడెన్‌కు ఈ సంఖ్య 45.8 శాతం మేర నమోదైంది.

    Also Read: కంగనాకు వార్నింగ్.. ‘నడిరోడ్డుపై రేప్ చేస్తా’..!

    అయితే.. మొదటి నుంచి కొంత పైచేయి సాధించినట్లు కనిపించిన బిడెన్‌.. ఇప్పుడు వెనుకబడిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో ట్రంప్‌ మెజారిటీని సాధించే దిశగా సాగుతున్నారు. మొదట్లో తన ప్రత్యర్థి జో బిడెన్ కంటే మెజారిటీలో వెనుకంజలో కనిపించిన ట్రంప్.. ఇప్పుడు ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. 2.6 శాతం మేర మెజారిటీని సాధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్-జో బిడెన్ మధ్య మూడో విడత డిబేట్ కొనసాగనుంది. టెన్సెస్సె నాష్‌విల్లేలోని బెల్మోంట్ యూనివర్శిటీలో ఈ డిబేట్‌ను ఏర్పాటు చేశారు. ఎన్బీసీ న్యూస్ కరస్పాండెంట్ క్రిస్టెన్ వేకర్ మోడరేట్‌గా వ్యవహరిస్తారు. సరిగ్గా 90 నిమిషాలపాటు ఈ డిబేట్ కొనసాగుతుంది. ఒక్కో టాపిక్ మీద 15 నిమిషాల పాటు డిబేట్ కొనసాగుతుంది. మొత్తం నాలుగు డిబేట్లను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఇందులో రెండో డిబేట్ రద్దుకాగా.. మూడో డిబేట్‌కు రెడీ అవుతున్నారు.

    ఈ నెల 15వ తేదీన రెండో విడత డిబేట్‌ను కొనసాగాల్సి ఉండే.. కానీ.. అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ బారిన పడ్డారు. అప్పటికే ఆయన కోలుకున్నప్పటికీ.. ప్రత్యక్షంగా డిబేట్‌లో పాల్గొనడానికి జో బిడెన్ అంగీకరించలేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టడానికి ట్రంప్ ఒప్పుకోలేదు. ఫలితంగా- దాన్ని రద్దు చేయాల్సి వచ్చింది.

    Also Read: సీఎం కేసీఆర్‌‌ అలా నోరు తెరిచి సాయం ఎందుకు కోరినట్లు..?

    టెన్సెస్సె నాష్‌విల్లేలోని బెల్మోంట్ యూనివర్శిటీ వేదికగా నిర్వహించనున్న మూడో డిబేట్‌ను అమెరికా కాలమానం ప్రకారం 22వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రారంభించనున్నారు. తొలి విడత డిబేట్‌లోనే అనేక అంశాలు చర్చకు రాగా.. కరోనా వైరస్ వ్యాప్తి, ఆర్థిక వ్యవస్థ.. వంటి ఎనిమిది కీలక అంశాలపై వాడివేడిగా చర్చ కొనసాగింది. రెండో విడత రద్దు కావడంతో అందులో ప్రస్తావనకు రావాల్సిన అంశాలను మూడో దఫా డిబేట్‌లో తెచ్చే అవకాశాలు లేకపోలేదు. నాలుగో విడత ముఖాముఖి కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నారు. అదే చివరిది కానుంది. ఇక నవంబర్ 3న ఎన్నికలు జరుగనున్నాయి.