కోర్టుల ద్వారా రక్షణ పొందినా.. కృష్ణమ్మ ఊరుకోదు చంద్రబాబూ?

ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వీటికి ఎగువన కురుస్తున్న వర్షాలూ తోడయ్యాయి. దీంతో కృష్ణా నది పోటెత్తుతోంది. ఇప్పటికే వరద నీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయన్న హెచ్చరికలు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో కృష్ణకు సమీపంలో ఉన్న భవనాల వారికి హెచ్చరికలు జారీ చేశారు. Also Read : రాహులే ప్రధాని.. దీపిక ప్రశంసలు.. అందుకే ఈ కష్టాలా? మాజీ సీఎం చంద్రబాబు నివాసం కూడా కృష్ణా […]

Written By: NARESH, Updated On : September 28, 2020 11:25 pm

tdp

Follow us on

ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వీటికి ఎగువన కురుస్తున్న వర్షాలూ తోడయ్యాయి. దీంతో కృష్ణా నది పోటెత్తుతోంది. ఇప్పటికే వరద నీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయన్న హెచ్చరికలు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో కృష్ణకు సమీపంలో ఉన్న భవనాల వారికి హెచ్చరికలు జారీ చేశారు.

Also Read : రాహులే ప్రధాని.. దీపిక ప్రశంసలు.. అందుకే ఈ కష్టాలా?

మాజీ సీఎం చంద్రబాబు నివాసం కూడా కృష్ణా నదికి సమీపంలోనే ఉంది. దీంతో రాజకీయంగా ఇప్పుడు వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. ‘చంద్రబాబు గారూ.. కృష్ణా నదికి వరద వస్తోంది. ఇకనైనా మీరు చట్టాన్ని గౌరవించి ఉండవల్లిలో అక్రమంగా కట్టిన గెస్ట్‌ హౌస్‌ను ఖాళీ చేయండి. కోర్టుల ద్వారా రక్షణ పొందినా.. ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చూసినా.. పైనుంచి వచ్చే వరద మాత్రం ఊరుకోదు. మీ ఇంటిని ముంచి వేయక మానదు’ అంటూ సజ్జల ట్వీట్‌ చేశాడు.

ఈ ట్వీట్‌కు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తనదైన రీతిలో కౌంటరిచ్చాడు. ‘రకరకాల పిటిషన్లు వేసి 10 ఏళ్లు గడిపారు. ఇప్పటికైనా దోచుకున్న సొత్తు ప్రజలకు ఇచ్చేయండి. లేకపోతే మరోసారి జైలుబాట తప్పదు. చట్టాల గురించి లెక్చర్లు ఇస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ముందు అక్రమ సొత్తుతో కట్టిన ఇళ్లను ఖాళీ చెయ్యమని జగన్‌ రెడ్డి గారిని డిమాండ్‌ చెయ్యాలి’ అంటే సూచించారు.

‘43 వేల కోట్ల ప్రజాధనం దోపిడీ.. యాలహంక రాజప్రసాదం, లోటస్‌ పాండ్‌ ప్యాలస్‌, తాడేపల్లిలో విలాసవంతమైన విల్లా, పేదల భూములు కొట్టేసి కట్టిన ఇడుపులపాయ ఎస్టేట్‌, దొంగ సొమ్ముతో పెట్టిన సాక్షి, క్విడ్‌ ప్రో కోతో పెట్టిన భారతి సిమెంట్స్‌ ఆస్తులు ఇప్పటికే ఈడీ అటాచ్‌ చేసింది’ అన్నారు. జగన్‌ ఇప్పటికైనా అక్రమాస్తులు ప్రభుత్వ ఖజానాకి జమ చేసి గౌరవించండి. ఏడాదితో రాజకీయ నాయకులపై పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు కూడా నిర్ణయించింది’ అంటూ స్ట్రాంగ్‌గా కౌంటరిచ్చారు. మరి దీనిపై వైసీపీ నేత సజ్జల కానీ.. మరే ఇతర నేతలు కానీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Read : చైనాకు షాక్: సరిహద్దుల్లో నిశ్శబ్ధ మిసైల్ దించిన భారత్