Wanted Lease Farmer: దేశంలో సాగు రంగం కుదేలవుతోంది. రైతుకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి. దీంతో నష్టాలే పలకరిస్తున్నాయి. ఈనేపథ్యంలో రైతు నిరంతరం దిగులు చెందుతున్నాడు. కలిసిరాని కాలంతో వేగలేక సాగుకు స్వస్తి చెప్పాలనుకుంటున్నాడు. చేసిన కష్టానికి ప్రతిఫలం లేకపోవడంతో ఇక లాభం లేదనుకుని అస్త్ర సన్యాసం చేస్తున్నాడు. వ్వవసాయంలో సాయం లేక ఇక ఆ పని చేయడానికి సైతం వెనకాడుతున్నాడు. ఇన్నాళ్లు అల్లు అద్దెకు ఇవ్వబడును అనే బోర్డులు చూశాం. కానీ రాబోయే రోజుల్లో పొలం కూడా అద్దెకు ఇవ్వబడును అనే బోర్డులు వస్తాయని తెలుస్తోంది. వ్యవసాయంలో రైతులకు లాభం లేకపోగా నష్టాలే పలకరిస్తున్నాయి.

గతంలో వ్యవసాయం లాభసాటిగానే ఉన్నా రానురాను పరిస్థితి మారిపోయింది. అన్ని ఖర్చులు పెరిగాయి. పెట్టుబడి పెరిగింది. కానీ దిగుబడి మాత్రం అలాగే ఉంది ధరలు సైతం గిట్టుబాటు కావడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కౌలురైతులను పట్టించుకోవడం లేదు. దీంతో వారి గతి అగమ్యగోచరమే. కౌలు రైతుకు కనీసం గుర్తింపు కూడా లేదు. ఈక్రమంలో కౌలు రైతుల కష్టాలు వర్ణనాతీతం. గుంటూరు జిల్లాలో ఓరైతు వినూత్న ప్రయోగం చేశాడు. తన పొలంలో పొలం కౌలుకు ఇవ్వబడును అని బ్యానర్ ప్రదర్శించాడు. దీంతో అందరు ఆసక్తిగా చూస్తున్నారు.
Also Read: Modi Jammu Tour: జమ్మూలోని ‘పల్లి’ ప్రత్యేకత ఏంటి..? ప్రధానికి ఇక్కడికి ఎందుకు వెళ్తున్నారు..?
జిల్లాలోని నారాకోడూరుకు చెందిన వెంకటేశ్వర్ రావుకు 5.20 ఎకరాల పొలం ఉంది. కానీ ఆయన కాలుకు గాయం కావడంతో వ్యవసాయం చేయలేని పరిస్థితి. దీంతో పొలం కౌలుకు ఇస్తానని అందరికి చెప్పినా ఎవరు ముందుకు రాలేదు. దీంతో ఇలా వినూత్నంగా ఆలోచించి పొలంలో బ్యానర్ పెట్టాడు. దీంతో అందరు ఆశ్చర్యకరంగా తిలకిస్తున్నా ఇంకా ఎవరు కూడా సేద్యం చేయడానికి ముందుకు రాకపోవడం గమనార్హం. వ్యవసాయమంటేనే అందరు భయపడుతున్నారు. అందులో కౌలు అంటే పెట్టుబడి పెరిగిన సందర్భంలో ఎక్కడి నుంచి తెచ్చేదనే ఆలోచనతోనే ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

వ్యవసాయమంటే ఎంత కష్టమో ఎవరికి తెలియంది కాదు. సాగు కోసం సవాలక్ష బాధలు పడాల్సిందే. పెట్టుబడి నుంచి మొదలు పంట చేతికొచ్చే వరకు నానా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే దేశంలో రైతుల సంఖ్య కూడా నానాటికి తగ్గుతోందని తెలుస్తోంది. దీనికి తోడు సాగులో ఉన్న కష్టాలు తలుచుకుంటేనే భయం వేస్తోంది. భవిష్యత్ లో రైతులు ఇంకా తగ్గిపోయి రైతుల పొలాలు అమ్ముకునే స్థితి వస్తోందనే హెచ్చరికలు వస్తున్నాయి. భవిష్యత్ లో సాగు రంగం మరింత కుదేలైపోయి రైతులకు మేలు చేకూరే సందర్భాలు తక్కువే అని తెలుస్తోంది. అదే పాశ్చాత్య దేశాల్లో వ్యవసాయదారులకు సబ్సిడీలు విరివిగా లభిస్తాయి. దీంతో వారు లాభసాటిగా వ్యవసాయం చేస్తుంటారు. కానీ మన దేశంలోనే రైతుల బాధలు చెప్పతరం కాదు.
Also Read:Telangana Congress: పీకే ఎఫెక్ట్: కాంగ్రెస్-టీఆర్ఎస్ కలిస్తే ‘రేవంత్ రెడ్డి’ టీ.కాంగ్రెస్ దారెటు?
[…] […]