Modi Jammu Tour: తుపాకుల మోత.. ఉగ్రవాదుల దాడుల భయం..ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లోని పరిస్థితి ఇది. ఇక్కడి ప్రజలు భిక్కుభిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవించసాగారు.. అయతే 370 ఆర్టికల్ రద్దు తరువాత కొన్ని ప్రాంతాల పరిస్థితి మారుతోంది. ముఖ్యంగా జమ్మూకు కేంద్రం భారీగా నిధులను విడుదల చేయిస్తూ అభివృవైపు వెళ్లేలా కృషి చేస్తోంది. ఈ తరుణంలో ఇప్పుడు జమ్మూలోని సాంబా జిల్లా పేరు మారుమోగుతోంది. కేంద్ర పాలిత ప్రాంతంలో తొలి కార్బన్ రహిత గ్రామంగా ‘పల్లి’ నిలిచింది. 500 కిలోల వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ఇక్కడ నెలకొల్పారు. దీనిని కేవలం 20 రోజుల వ్యవధిలోనే నిర్మించడం విశేషం. ఆ గ్రామ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జమ్మూలోని సాంబ జిల్లాలోని పల్లి గ్రామం పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. 370 ఆర్టికల్ రద్దు తరువాత కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతంగా జమ్మూను ప్రకటించారు. ఆ తరువాత ఈ ప్రాంతంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టి భారీగా నిధులు కేటాయిస్తోంది. ఈ క్రమంలో 2.75 కోట్ల వ్యయంతో 2340 ఇళ్లకు సౌరవిద్యుత్ అందించేలా ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 24న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ప్లాంట్ ను గ్రామ పంచాయతీకి అంకితం చేశారు. దీని ద్వారా కార్బన్ రహిత గ్రామంగా నిలుస్తుంది. ఇక్కడి ప్రజలు స్థానిక పవర్ గ్రిడ్ స్టేషన్లలో ఉత్పత్తి చేసిన కార్బన్ రహిత విద్యుత్ నుపొందనున్నారు.
Also Read: Telangana Congress: పీకే ఎఫెక్ట్: కాంగ్రెస్-టీఆర్ఎస్ కలిస్తే ‘రేవంత్ రెడ్డి’ టీ.కాంగ్రెస్ దారెటు?
అయితే ఈ ప్లాంట్ ను నెలకొల్పడానికి కేవలం 20 రోజులు మాత్రమే పట్టిందని ఇంజనీర్లు తెలుపుతున్నారు. రోజుకు 18 గంటలకు పైగా కష్టపడినట్లు సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సూపర్ వైజర్లు తెలుపుతున్నారు. పైట్ ఇంజనీర్లు, ఇతర నిపుణులతో కూడిన బృందం ఇందులో పాలుపంచుకున్నారు. సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 90 రోజులు పడుతుంది. కానీ స్థానిక పరిపాలన విభాగం నుంచి లభించిన సాయం, ప్రొత్సాహంతోనే ఇది సాధ్యమైందని అంటున్నారు. వారి సాయం లేకుండా ఈ పని పూర్తయ్యేది కాదని అంటున్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో పల్లి గ్రామ ప్రజలకు విద్యుత్ కోతల ను భారీగా ఉపశమనం లభిస్తుంది. అంతకుముందు 6 నుంచి 8 గంటల పాటు విద్యుత్ కోతలు ఉండేవి. అంతేకాకుండా విద్యుత్ చార్జీలు కూడా భారీగా తగ్గుతాయని అంటున్నారు.

పల్లి గ్రామంలో విద్యుత్ ప్లాంట్ మాత్రమే కాకుండా మిగతా అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. ఒకప్పుడు మెయిన్ రోడ్డు నుంచి పల్లి గ్రామానికి వెళ్లే దారులు అధ్వానంగా ఉండేవి. కానీ ఇప్పుడు ప్రధాని పర్యటన కారణంగా ఈ రోడ్లన్నీ కళకళళాడుతున్నాయి. ఇక గ్రామంలోని పబ్లిక్ టాయిలెట్లు, పంచాయతీ కార్యాలయం నుంచి ప్రభుత్వ పాఠశాలల వరకు అన్ని చోట్ల పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారని స్థానికులు తెలుపుతున్నారు. గ్రామ సర్పంచ్ రణ్ ధీర్ కూడా ఈ కార్యక్రమాల్లో బిజీగా మారారు. అభివృద్ధి చెందిన గ్రామంగా నిలిచినందుకు ప్రభుత్వానికి కృతజ్ఓతలు తెలిపారు. ఇతర పంచాయతీలు కూడా దీనిని ఆదర్శంగా తీసుకోవాలని కొందరు అంటున్నారు.
Also Read:Padayatra: పాదయాత్రలతో అధికారంలోకి వస్తారా..? చరిత్ర ఏం చెబుతోంది..?