Swathi Naidu- Chammak Chandra: జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర అంటే చాలా ఫేమస్. మొదటి నుండే సెటైరికల్ పంచులతో జబర్దస్త్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న చంద్ర తాజాగా సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే జబర్దస్త్ లో వచ్చిన పేరుతో చమ్మక్ చంద్ర ఒక సెలబ్రెటీ హోదా లో కొనసాగుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనను గుర్తుపట్టని వారు ఉండరు. అంతలా ఫేమస్ అయ్యాడు చంద్ర.

ఇదిలా ఉండగా యూట్యూబ్ లో శృంగార తారగా పేరు తెచ్చుకున్న స్వాతి నాయుడు తాజాగా చమ్మక్ చంద్రపై లైంగిక ఆరోపణలు చేసింది. చమ్మక్ చంద్ర బయటకు అనుకున్నంత మంచివాడు కాదని అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకునే మనస్తత్వం ఆయనది అంటూ బాంబు పేల్చింది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నాతో పాటు చాలా మంది అమ్మాయిలను వాడుకున్నాడని చెప్పింది. జబర్దస్త్ లో తనకు ప్రత్యేకంగా అవకాశం ఇస్తానని అరు నెలల క్రితం తనను లైంగికంగా వాడుకున్నాడని ఆరోపణలు చేసింది. అప్పట్లో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. అయితే తాజాగా ఒక యుట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. జబర్దస్త్ బిగినింగ్ లో చమ్మక్ చంద్ర తనకు పరిచయం అయ్యాడని అప్పటికే తనకు లవ్ ఫెయిల్యూర్ అయిందని బాధలో వున్న నాకు జబర్దస్త్ లో అవకాశం ఇస్తానని నమ్మించి నన్ను వెంట తిప్పుకున్నాడని బాంబు పేల్చింది. రెగ్యులర్ గా ఫోన్స్ చేయడం, తన కార్ లో తిరగడం చేశామని చెప్పింది. చాలా సార్లు ఆయన ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళామనింది.
Also Read: Wanted Lease Farmer: పొలం కౌలుకు ఇవ్వబడును ఆసక్తికరంగా వెలసిన పోస్టర్ ?
జబర్దస్త్ లో ఆడవాళ్ల గెటప్ కు మంచి ఆదరణ ఉంటుందని అందుకే తనను నమ్మించి వేశాలు ఇస్తానని చెబితే నేను నమ్మాను అనింది. తీరా నన్ను లైంగికంగా వాడుకున్న తర్వాత ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా వదిలేశాడని చెప్పింది. ఇదే విషయమై అప్పట్లో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చానని అతను ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు అనింది. అంతేకాదు తనను చంపేందుకు కూడ ప్రయత్నాలు చేశాడని చెప్పింది. నేనే కాదు ఆయన కామవాంచకు ఎందరో అమ్మాయిలు బలైపోయారని చెప్పింది. అయితే కొంతమంది నా మాటలు నమ్మడంలేదని ఒకవేళ అది తప్పైతే జబర్దస్త్ లో అంతమంది ఉండగా కేవలం చంద్ర మీద మాత్రమే నేను ఆరోపణలు ఎందుకు చేస్తానో చెప్పాలంది.

కేవలం చంద్రనే కాదని చంద్రలాంటి వాళ్ళు చాలా మంది డైరెక్టర్లు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని చెప్పి అమాయక అమ్మాయిలను మోసం చేస్తున్నారని చాలా మంది అమ్మాయిలు భయంతో బయటి ప్రపంచానికి చెప్పడం లేదని తెలిపింది. అయితే ఈ మధ్య కాలంలో సెలబ్రెటీ లపై ఆరోపణలు చేయడం సాధారణంగా చూస్తూనే వున్నాం అయితే స్వాతి నాయుడు చెప్పిన మాటల్లో నిజం ఎంత వుందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఒకవేళ ఇదేగాని నిజం అయితే చమ్మక్ చంద్ర ఇంత చెడ్డవాడా..? అనే ప్రశ్న బుల్లితెర ప్రేక్షకులకు కలగక మానదు.
Also Read:Telangana Congress: పీకే ఎఫెక్ట్: కాంగ్రెస్-టీఆర్ఎస్ కలిస్తే ‘రేవంత్ రెడ్డి’ టీ.కాంగ్రెస్ దారెటు?
Recommended Videos:
[…] Also Read: Swathi Naidu- Chammak Chandra: చమ్మక్ చంద్ర నిజంగానే వాడ… […]