ఓటుకునోటు: హైకోర్టులో రేవంత్ కు పోటు

భావి తెలంగాణ కాంగ్రెస్ వారసుడు.. కాబోయే సీఎం అని పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డిని ‘ఓటుకు నోటు’ కేసు మాత్రం వదలడం లేదు. ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్లినా కూడా ఆయనను ఈ కేసు విడిచిపెట్టడం లేదు. తాజాగా హైకోర్టులో మరోసారి రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ […]

Written By: NARESH, Updated On : June 1, 2021 6:23 pm
Follow us on

భావి తెలంగాణ కాంగ్రెస్ వారసుడు.. కాబోయే సీఎం అని పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డిని ‘ఓటుకు నోటు’ కేసు మాత్రం వదలడం లేదు. ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్లినా కూడా ఆయనను ఈ కేసు విడిచిపెట్టడం లేదు. తాజాగా హైకోర్టులో మరోసారి రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది.

ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందంటూ హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను విచారించకుండానే హైకోర్టు కొట్టి వేయడం గమనార్హం.

గతంలో ఇదే పిటీషన్ ను రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టులో వేశారు. ఓటుకు నోటు కేసు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని.. ఏసీబీకి సంబంధం లేదని పేర్కొంటూ రేవంత్ రెడ్డి గతంలో ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. రేవంత్ రెడ్డి పిటీషన్ ను కొట్టివేసింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని స్పష్టంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి పిటీషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు.

ఓటుకు నోటు కేసు తెలంగాణలో సంచలనమైంది.. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.50లక్షలు ఇస్తూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ప్రలోభ పెడుతూ అప్పటి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. టీడీపీ పోటీదారు వేం నరేందర్ రెడ్డి గెలిపించేందుకు రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రయత్నాలను తెలంగాణ సర్కార్ వీడియోలతో సహా బయటపెట్టడం నాడు సంచలనమైంది.