https://oktelugu.com/

ఆన్ లైన్ లో ఆనందయ్య మందు పంపిణీ

ఆనందయ్య ఆయుర్వేద మందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంట్లో వేసే చుక్కల మందు తప్ప మిగతా వాటికి పర్మిషన్ ఇచ్చింది. ఆనందయ్య ఆయుర్వేద మందును ఆన్ లైన్ లో అందజేస్తామని పేర్కొంది. దీంతో సుదూర ప్రాంతాల్లోని రోగులకు మేలు జరగనుంది. ఇన్నాళ్లు ఎదురు చూసిన వారికి తీపి కబురు అందింది. అంతకుముందు ఆనందయ్య నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సమావేశమయ్యారు. ఆయుర్వేద మందు గురించి వారిద్దరి మధ్య చర్చ సాగింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆనందయ్య […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 1, 2021 / 06:20 PM IST
    Follow us on

    ఆనందయ్య ఆయుర్వేద మందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంట్లో వేసే చుక్కల మందు తప్ప మిగతా వాటికి పర్మిషన్ ఇచ్చింది. ఆనందయ్య ఆయుర్వేద మందును ఆన్ లైన్ లో అందజేస్తామని పేర్కొంది. దీంతో సుదూర ప్రాంతాల్లోని రోగులకు మేలు జరగనుంది. ఇన్నాళ్లు ఎదురు చూసిన వారికి తీపి కబురు అందింది.

    అంతకుముందు ఆనందయ్య నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సమావేశమయ్యారు. ఆయుర్వేద మందు గురించి వారిద్దరి మధ్య చర్చ సాగింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆనందయ్య మందు పంపిణీకి చర్యలు తీససుకుంటున్నామని కలెక్టర్ వివరించారు. కరోనా పాజిటివ్ రోగులకిచ్చే మందు పంపిణీకి మొదట ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

    ఆనందయ్య మందు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. త్వరలో ఆన్ లైన్ ద్వారా మందు అందజేస్తామని చెప్పారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న వారికి సైతం అందనుంది. రోగుల బంధువులు నెల్లూరుకు వచ్చి మందు తీసుకుపోవడం కన్నా ఆన్ లైన్ డెలివరీ వల్ల మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

    ఆయుర్వేద మందు తయారీకి కొన్ని రోజుల సమయం పడుతుందన్నారు. జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల నుంచి మందు కోసం ఎవరూ రావొద్దని సూచించారు. కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే ఉండాలని వివరించారు. అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని పేర్కొన్నారు.