https://oktelugu.com/

జగన్‌ ఫోకస్‌ అంతా విశాఖపైనే!

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి విశాఖపట్టణంపై ఫోకస్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ రాజధానికి న్యాయపరమైన అడ్డంకులు ఉన్నా.. తనపనితాను చేసుకుపోతున్నారు. ఇప్పటికే విశాఖను క్యాపిటల్‌గా ఎంపికచేయడంతో ప్రతిపక్షాలు హైకోర్టు, సుప్రింకోర్టులోలో వందల సంఖ్యలో పిటిషన్లు వేశాయి. వీటిపై విచారణ జరుగుతోంది. ఇవేమీ పట్టించుకోకుండా ఏపీ సర్కారు మాత్రం ప్రభుత్వ శాఖల కోసం విశాఖలో భవనాలకు వెతికే పనిలో పడింది. Also Read: విశాఖ మేయర్‌‌ యాదవ వర్గానికే! టూరిజం భవనాల్లోనే సీఎం క్యాంప్‌ ఆఫీస్‌! విశాఖలోని […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 8, 2020 / 01:59 PM IST
    Follow us on


    ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి విశాఖపట్టణంపై ఫోకస్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ రాజధానికి న్యాయపరమైన అడ్డంకులు ఉన్నా.. తనపనితాను చేసుకుపోతున్నారు. ఇప్పటికే విశాఖను క్యాపిటల్‌గా ఎంపికచేయడంతో ప్రతిపక్షాలు హైకోర్టు, సుప్రింకోర్టులోలో వందల సంఖ్యలో పిటిషన్లు వేశాయి. వీటిపై విచారణ జరుగుతోంది. ఇవేమీ పట్టించుకోకుండా ఏపీ సర్కారు మాత్రం ప్రభుత్వ శాఖల కోసం విశాఖలో భవనాలకు వెతికే పనిలో పడింది.

    Also Read: విశాఖ మేయర్‌‌ యాదవ వర్గానికే!

    టూరిజం భవనాల్లోనే సీఎం క్యాంప్‌ ఆఫీస్‌!

    విశాఖలోని కాపులుప్పాడ ఐటీ టవర్స్‌లో సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ అక్కడ సీఎం రాకపోకలు సాగిస్తే ఐటీ సంస్థలకు ఇబ్బంది వస్తుందని నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలు కూడా ఐటీని విశాఖ నుంచి బయటికి పంపిస్తున్నారని ఆరోపించండం కూడా ఓ కారణం. దీంతో ప్రభుత్వం బీచ్‌రోడ్డులోని రుషికొండ మీద ఉన్న భవనాలను పరిశీలించాని ఆదేశించింది. ఇక్కడ టూరిజం శాఖ భవనాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇందులో ఓ భవనంలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డీజీపీ ఆఫీస్‌ కూడా రుషికొండ మీదనే ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

    ఆఫీసులన్నీ విశాఖకే..

    అమరావతి నుంచి అడ్మినిస్ట్రేషన్‌ భవనాలను విశాఖకు తరలించడం ఖాయంగా తెలుస్తోంది. ఇందులోభాగంగా ఆఫీసర్లు రుషికొండతో పాటు ప్రైవేట్ బిల్డింగ్స్ ని కూడా పరిశీలిస్తున్నారు. టూరిజం భవనాలతో పాటు హరితా కాటేజెస్‌ను ఖాళీగా ఉండడంతో వాటిని మొత్తం తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చారంట. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికల్లా రాజధాని తరలింపు ఉంటుందని వారు చెబుతున్నారు.

    Also Read: రైతుల ఆవేదన.. పోస్టుకార్డుల రూపంలో రాష్ట్రపతికి..!

    రాత్రివేళ్లలో ఆఫీసుల పరిశీలన

    హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండగానే విశాఖకు రాజధాని తరలింపు రాజకీయంగా మైనస్‌ అవుతుందని భావించిన ఏపీ సర్కారు అంతా రహస్యంగా నడిపిస్తోంది. ఇందులోభాగంగా ఆఫీసర్లు అనధికారికంగా అవసమైన భవనాలను పరిశీలిస్తున్నారు. అదికూడా రాత్రి వేళల్లో కావడం గమనార్హం. చివరగా స్టేట్ గెస్ట్ హౌస్‌ను విశాఖలోని కాపులుప్పాడలో నిర్మించనున్నామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో.. రాజధాని తరలింపు ఖాయంగా కనిపిస్తోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్