ఏపీకి ఆర్థిక వనరుగా విశాఖనగరం

విశాఖపట్టణం.. పారిశ్రామిక.. పర్యాటక ప్రాంతం.. దేశంలోని ప్రముఖ నగరాల్లో విశాఖ ఒకటి. విశాఖ ఓడరేవు ద్వారా సరుకుల రవాణా కేంద్రంగా పేరు సంపాదించింది. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని అంతా భావించారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ మెహన్ రెడ్డి రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయంతో విశాఖ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందబోతోంది. పర్యాటకంగా.. అభివృద్ధి చేసి.. అంతర్జాతీయ పేరు సంపాదించేలా పట్టణాన్ని రూపొందించాలని ప్రభుత్వం […]

Written By: Srinivas, Updated On : April 8, 2021 5:25 pm
Follow us on


విశాఖపట్టణం.. పారిశ్రామిక.. పర్యాటక ప్రాంతం.. దేశంలోని ప్రముఖ నగరాల్లో విశాఖ ఒకటి. విశాఖ ఓడరేవు ద్వారా సరుకుల రవాణా కేంద్రంగా పేరు సంపాదించింది. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని అంతా భావించారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ మెహన్ రెడ్డి రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయంతో విశాఖ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందబోతోంది. పర్యాటకంగా.. అభివృద్ధి చేసి.. అంతర్జాతీయ పేరు సంపాదించేలా పట్టణాన్ని రూపొందించాలని ప్రభుత్వం అనుకుంటోంది.

విశాఖను పరిపాలన రాజధానిగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే అంతకు ముందే విశాఖ పర్యాటకంగా.. సాంస్కృతికంగా.. సినిమా రంగంలో ఎంతో అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో విభజన రాష్ట్రం ఏపీకి విశాఖ ఇప్పుడు మంచి ఆర్థిక వనరుగా మారుతోందని నిపుణులు భావిస్తున్నారు. విశాఖలో అపారమైన సహజవనరులు ఉన్నాయి. అంతకు మించిన ప్రకృతి అందాలు ఈ నగరానికి సొంతం.

విశాఖను టూరిస్టు ప్రదేశంగా మార్చాలని సీఎం జగన్ అనుకుంటున్నారు. ఇలా చేస్తే.. ఏపీ ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం సమకూరే అవకాశం ఉంది. విశాఖ గొప్పతనాన్ని గుర్తించిన జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా ఎంపిక చేశారని ఇక్కడి ప్రజల వాదన. విశాఖ నగరంలోని రుషికొండ రిసార్ట్స్ అభివృద్ధి కోసం ప్రభుత్వం తాజాగా అనుమతులు మంజూరు చేసింది. దీంతో రుషికొండ పైన ఉన్న 65 ఎకరాల విస్తీర్ణంలో 30 ఎకరాల్లో టూరిజం పేరిట భారీ నిర్మాణాలు చేపడుతారు.

విశాఖకు నిత్యం వందలాది మంది పర్యాటకులు వస్తుంటారు. బీచ్, ఆలయాలు.. లైట్ హౌస్, అరుకు లోయ తదితర ప్రదేశాలు చూసి వెళ్తుంటారు.విదేశాల నుంచి సైతం పర్యాటకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో మరింత అభివృద్ధి చేస్తే.. పర్యాటకుల రద్దీ పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా వైజాగ్ లో రూ.100 కోట్లతో పర్యాటక అభివృద్ధి పనులు చేపడతారని తెలుస్తోంది. దీనికి అనుబంధంగా మరిన్ని కార్యక్రమాల కోసం కూడా ఏపీ టూరిజంశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. త్వరలో విశాఖ నగరం పూర్తిస్థాయిలో పర్యాటక ప్రాంతంగా మారబోతోంది.