https://oktelugu.com/

ఎక్స్ క్లూజివ్: ప్రభాస్, చిరు మధ్య నలుగుతున్న హీరో

సినిమాల్లో రాణించాలి అంటే.. ఒకప్పుడు అదృష్టం ఉండాలి. కానీ, ఈ రోజుల్లో టాలెంట్ ఉంటే చాలు, ఏదొక రకంగా టాలెంట్ ను చూపించుకునే అవకాశాలు ఈ డిజిటల్ యుగంలో ఎక్కువైపోయాయి. టాలెంటెడ్ యంగ్ యాక్టర్ సత్యదేవ్ ఈ విషయంలో ఉదాహరణగా నిలిచాడు. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. హీరో స్థాయికి ఎదిగాడు. నిజానికి సత్యదేవ్ కి లౌక్యం లేదు, కొన్ని టాప్ ప్రొడక్షన్ హౌస్ లతో చిన్న చిన్న గొడవలు కూడా ఉన్నాయి. అయినా, […]

Written By: , Updated On : April 8, 2021 / 04:05 PM IST
Follow us on

Satyadev
సినిమాల్లో రాణించాలి అంటే.. ఒకప్పుడు అదృష్టం ఉండాలి. కానీ, ఈ రోజుల్లో టాలెంట్ ఉంటే చాలు, ఏదొక రకంగా టాలెంట్ ను చూపించుకునే అవకాశాలు ఈ డిజిటల్ యుగంలో ఎక్కువైపోయాయి. టాలెంటెడ్ యంగ్ యాక్టర్ సత్యదేవ్ ఈ విషయంలో ఉదాహరణగా నిలిచాడు. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. హీరో స్థాయికి ఎదిగాడు. నిజానికి సత్యదేవ్ కి లౌక్యం లేదు, కొన్ని టాప్ ప్రొడక్షన్ హౌస్ లతో చిన్న చిన్న గొడవలు కూడా ఉన్నాయి. అయినా, ఆ ప్రొడక్షన్ హౌస్ లే తగ్గి.. పిలిచి మరీ ఛాన్స్ లు ఇస్తున్నాయి సత్యదేవ్ కి.

కారణం అతనిలోని నటనా ప్రతిభే. ప్రస్తుతం సత్యదేవ్ సినిమాలతోనే కాకుండా వెబ్ సీరీస్ లతోనూ ఫుల్ బిజీ. పైగా మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ లో సత్యదేవ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమాలో కూడా ఒక కీలక పాత్రను సత్యదేవ్ పోషించబోతున్నాడు. ఈ పాత్ర సినిమాకి మెయిన్ హైలైట్ అవుతుందట. అందుకే, సత్యదేవ్ ఈ సినిమా కోసం మే నుండి డేట్స్ ను కేటాయించనున్నాడు. కాకపోతే, మెగాస్టార్ లూసిఫర్ సినిమాకి జూన్ నుండి డేట్స్ కావాలట. అయితే, జూన్ నాటికి ప్రభాస్ సినిమా షూట్ లో ఉంటాడు సత్యదేవ్.

దానికితోడు ఒక్క ప్రభాస్ సినిమా కోసమే ఆగష్టు వరకూ డేట్స్ కేటాయించాలట. మొత్తంగా సత్యదేవ్ ఇప్పుడు మెగాస్టార్ సినిమాని వదులుకోవాలా ? లేక ప్రభాస్ సినిమానే వదులుకోవాలా ? అనేది తేల్చుకోవాల్సి ఉంది. ఆల్ రెడీ చిరు సినిమాకి కమిట్ అయ్యాడు కాబట్టి.. చిరు సినిమా చేస్తాడా ? లేక ప్రభాస్ సినిమాలో కీలక రోల్ కాబట్టి ఆ సినిమా చేస్తాడా ? ఏది ఏమైనా సత్యదేవ్ కి రోజురోజుకూ ఇంకా డిమాండ్ పెరుగుతుంది. మరోపక్క పలు వెబ్ సీరీస్ లు కూడా చేస్తున్నాడు. అలాగే ఇప్పటికే అతని చేతిలో రెండు సినిమాలు కూడా ఉన్నాయి.