భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలం పెంచుకుంటోంది. ఇటీవల జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటింది. ఇదే ప్రేరణగా ఇప్పుడు ఏపీలోనూ బీజేపీ బలం పెంచుకునేందుకు ఆ పార్టీ నాయకులు వ్యూహం రచిస్తున్నారు. ఇందుకు తిరుపతి ఉప ఎన్నికను అవకాశంగా చేసుకుంటున్నారు. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక బీజేపీకి కలిసొచ్చింది. ఏపీలోనూ తిరుపతి ఉప ఎన్నిక ద్వరా తమ ప్రతాపం చూపాలని ఏపీ బీజేపీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. అయితే తెలంగాణలో మాదిరిగి ఏపీలో హిందుత్వం అనే ఎజెండాను తీసుకోరట. ఇతర సమస్యలపై ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్తామంటున్నారు.
Also Read: ఏపీ ‘లోకల్ వార్’: సర్కారు కొత్త వ్యూహం ఇదే!
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో అధికార వైసీపీతో పాటు టీడీపీ తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించాయి. నోటిఫికేషన్ విడుదల కాకముందే ఇక్కడ తమ పాగా వేయాలని వైసీపీ, టీడీపీలు ఎవరి ప్రణాళికను వారు రచిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ సైతం తన పట్టును నిలపాలని తహతహలాడుతోంది.దేశంలోనూ పలు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం ఎక్కవగా ఉన్నా.. ఏపీలో మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. అయితే తిరుపత ఉప ఎన్నిక ద్వారా బీజేపీ ప్రాబల్యం పెంచాలని ఆ పార్టీ నాయకులు యోచిస్తున్నారు.
అయితే వచ్చే ఉప ఎన్నికలో బీజేపీ అంటే కేవలం హిందుత్వ పార్టీ అని కాకుండా స్థానిక సమస్యలపై పోరాటం చేసే విధంగా ప్రచారం చేయాలని పార్టీలో చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను కేంద్ర సహాయంలో చేపట్టే విధంగా క్రుషి చేస్తామని ప్రచారం చేయనున్నారు. ఇక మూడు రాజధానుల విషయంలో రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ అనుకూలంగా ఉంది. ఆ విషయంపై కూడా ప్రచారం చేయనున్నారు.
Also Read: బీజేపీకి బంపరాఫర్ ఇస్తున్న కేసీఆర్.. వ్యూహంలో భాగమేనా?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టన నాటి నుంచి పలు కార్య్రమాల్లో బీజేపీ నాయకులు పాల్గొంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది ఘటనలో బీజేపీ, జనసేనలు కలిసి ఆందోళనను తీవ్రతరం చేశాయి. దీంతో సీఎం జగన్ ఆ ఘటనపై సీబీఐ చేత దర్యాప్తు చేసేలా నిరసనను తెలిపాయి. ఇక త్వరలో జరిగే తిరుపతి ఉప ఎన్నికలోనూ బీజేపీ, జనసేనలు కలిసి అభ్యర్థిని నిలబెట్టనున్నాయి. ఈ రెండు పార్టీల అధ్వర్యంలో ముఖ్యంగా హిందుత్వం అనే ఎజెండాగా కాకుండా స్థానిక సమస్యలపై ప్రచారం చేయనున్నారట. అయితే ఈ ఉప ఎన్నికలో బీజేపీ ఏ మేరకు తన ప్రభావం చూపిస్తుందో చూడాలి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్