Homeఆంధ్రప్రదేశ్‌Gautam Adani- Vizag Steel: విశాఖ ఉక్కు.. త్వరలో అదాని స్టీల్స్ గా మారనుందా?

Gautam Adani- Vizag Steel: విశాఖ ఉక్కు.. త్వరలో అదాని స్టీల్స్ గా మారనుందా?

Gautam Adani- Vizag Steel: విశాఖ ఉక్కు త్వరలో అదాని స్టీల్స్ గా మారనుందా? కేంద్ర ప్రభుత్వం అదాని సంస్థకు స్టీల్ ప్లాంట్ ను విక్రయించనుందా? ఇప్పటివరకూ కొనుగోలు చేసే సంస్థల జాబితాలో చాలా కంపెనీల పేర్లు వినిపించినా.. ఇప్పుడు ఆ జాబితాలో అదాని చేరిందా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంయుక్త స్నేహితుడు కావడంతో అదానికి మార్గం సుగమమైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ప్రస్తుతం అదాని తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉన్నారు. ఖయిలా పడిన పరిశ్రమలను కొనుగోలు చేసి అభివృద్ధిలోకి తేవడం పనిగా పెట్టుకున్నారు. అప్పులు చేసైనా సొంతం చేసుకున్న సందర్భాలున్నాయి. పైగా ప్రభుత్వాల సహకారం పుష్కలంగా ఆయనకు లభిస్తుందన్న టాక్ అయితే ఉంది. అందుకే ప్రతీ రాష్ట్రంలోనూ ఆయన తన వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. ఉన్న పరిశ్రమలను టేకోవర్ చేసుకొని భారీగానే లాభాలను అర్జిస్తున్నారు. ఇప్పుడు ఆయన చేతికి విశాఖ ఉక్కు కర్మాగారం వెళుతుందన్న టాక్ అయితే ఉంది. అయితే విశాఖ ఉక్కు ఏపీలో ఉంది కాబట్టి, ఢిల్లీ పెద్దల అనుగ్రహం ఉంది కాబట్టి తప్పకుండా ఆయన చేతిలోకి విశాఖ ఉక్కు చేరుతుందన్న టాక్ అయితే పూర్తిగా వినిపిస్తోంది.

Also Read: Ram Charan- Jr NTR Enter Politics: రాజకీయాల్లోకి ఎన్టీఆర్, రామ్‌చరణ్‌.. పోటీ ఎక్కడి నుంచంటే?

Gautam Adani- Vizag Steel
Gautam Adani

ఇప్పటికే ఏపీలో తన వ్యాపార, పరిశ్రమలను అదాని గ్రూప్ విస్తరించింది. పోర్టులు, హైవేలు, సంప్రదాయ ఇంధన విద్యుత్ లలో అదాని గ్రూపుదే సింహభాగం. మెజార్టీ షేర్స్ ఆ కంపెనీవే. ఇప్పుడు ఆ కంపెనీ కన్ను విశాఖ స్టీల్ ప్లాంట్ పై పడింది. దానిని హస్తగతం చేసుకోనుందన్న వార్త ఇప్పుడే బయటపడింది. అయితే గత అనుభవాల దృష్ట్యా అది ఏమంత సాధ్యం కాని పని కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదాని విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయన్న టాక్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో అదాని సంస్థ ఇష్టపడితే అటు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ఇటు జగన్ సర్కారు అన్ని విధాలా సహకరించే అవకాశమైతే ఉంది.

Gautam Adani- Vizag Steel
Vizag Steel

విశాఖ ఉక్కును అమ్మేయ్యాలని కేంద్ర ప్రభుత్వం ఏనాడో నిర్ణయించింది. అదో నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. కానీ ఉద్యోగులు, కార్మికులు, స్థానికులు ఉద్యమ బాట పట్టారు. దీనికి అన్ని రాజకీయ పక్షాలూ మద్దతు ప్రకటించాయి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయమైతే తీసుకుంది. అవసరమైతే మూసివేస్తాం కానీ.. అమ్మడం పక్కా అని సంకేతాలిచ్చింది. అటు విశాఖ స్టీల్ కొనుగోలు చేసే కంపెనీల జాబితా చాలానే ఉంది. అయితే ఇప్పుడు విశాఖ ఉక్కుపై అదాని చూపు పడిందని.. దక్కించుకునేందుకు పావులు కదుపుతోందన్న టాక్ అయితే మాత్రం నడుస్తోంది. అదాని సంస్థలకు ఒక అలవాటు ఉంది. వ్యాపార విస్తరణలో భాగంగా వారు కొత్తగా పరిశ్రమలు నెలకొల్పరు. ఉన్నవాటినే టెకోవర్ చేస్తారు. అంటే కచ్చితంగా విశాఖ ఉక్కును టేకోవర్ చేసే చాన్స్ ఉందని కూడా పారిశ్రామికవర్గాల్లోటాక్ అయితే ఉంది. అటు సహకరించే ప్రభుత్వాలు ఉండడంతో విశాఖ ఉక్కు.. త్వరలో అదాని స్టీల్స్ గా మారే అవకాశమున్నట్టు మాత్రం తెలుస్తోంది.

Also Read: Ram Charan- Jr NTR Enter Politics: రాజకీయాల్లోకి ఎన్టీఆర్, రామ్‌చరణ్‌.. పోటీ ఎక్కడి నుంచంటే? 

Recommended videos:

జగన్ గారు పవన్ కళ్యాణ్ కు క్షమాపణ చెప్పండి || Pawan Kalyan || CM Jagan || Ok Telugu

ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ || Pawan Kalyan as Chief Minister TDP Master Plan || Ok Telugu

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version