Chiranjeevi- Mohan Babu: తెలుగు సినిమారంగంపై చిరంజీవిది చెరగని ముద్ర. స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగారు. ఇప్పుడు ఆయన కాంపౌండ్ నుంచి వచ్చిన తమ్ముళ్లు, కుమారులు, మేనల్లుళ్లు సక్సెస్ ఫుల్ జర్నీ చేస్తున్నారు. అటు సోదరుడు పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలో కూడా ఉన్నారు. జనసేన పార్టీని స్థాపించి ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. అధికారం దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పటికే రాజకీయాల్లో అడుగు పెట్టి…మళ్లీ రీ బ్యాక్ అయ్యారు చిరంజీవి. ప్రస్తుతం సినిమాలపైనే దృష్టిపెట్టారు. జాతీయ పార్టీల నుంచి ఆహ్వానం ఉన్నా తిరస్కరించారు. దీంతో చిరంజీవి దాదాపు రాజకీయాలకు దూరమైనట్టేనని అంతా భావించారు. కానీ ఇటీవల ఆయన తన మనసులో మాటను బయటపెట్టడం చర్చనీయాంశమైంది. మెగాస్టార్ లెటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ దసరా సందర్భంగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మళయాళంలో విజయం సాధించిన లూసీఫర్ కు రిమేక్ గా రూపొందిన ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. రామ్ చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్. ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సమకాలిన రాజకీయాంశాలను ఇతివృత్తంగా తీసుకొని రూపొందించినట్టు సమాచారం. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలైతే ఉన్నాయి.
గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా చిరంజీవి విడుదల చేసిన వాయిస్ క్లిప్స్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పది సెకెండ్ల నిడివితో రెండు డైలాగులు పేలాయి. రాజకీయంగా దుమారాన్ని రేపాయి. ‘నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను.. నా నుంచి రాజకీయం దూరం కాలేదు’ అంటూ చిరంజీవి పలికిన డైలాగులు దుమారాన్ని రేపుతున్నాయి. ఎన్నో ఆలోచనలు, అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి చిరంజీవి పొలిటికల్ గా రీ ఎంట్రీ ఇస్తారన్న ఊహగానాలు ప్రారంభమయ్యాయి. దీనిపై జనసైనికులు, మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ తో చిరంజీవి జత కలుస్తారని ఆనందం వ్యక్తంచేస్తున్నారు. అభిమానులకు ఇంత కంటే మంచి వార్త ఏమి ఉంటుందంటున్నారు. మొత్తానికైతే 10 సెకెండ్ల నిడివితో చిరంజీవి మాటలు అటు రాజకీయంగా కూడా షేక్ చేస్తున్నాయి.
చిరంజీవి రాజకీయాల్లో ఎక్టివ్ కావడాన్ని జనసేన వర్గాలు ఆహ్వానిస్తున్నాయి. ఆ పార్టీ కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ తొలుత స్పందించారు. మెగాస్టార్ కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉందని గుర్తుచేశారు. రాజకీయాలు శాసించగల శక్తి చిరంజీవికి ఉందన్నారు. పైగా రాజకీయాలకు, సినిమారంగానికి విడదీయ రాని సంబంధం ఉందన్నారు. తన స్వశక్తితో మెగాస్టార్ స్థాయికి చిరంజీవి ఎదిగారని గుర్తుచేశారు. తన కుటుంబ హీరోలకు మార్గం చూపించిన దార్శనికుడిగా అభివర్ణించారు. మెగా కాంపౌండ్ వాల్ నుంచి వచ్చిన హీరోలు సక్సెస్ ఫుల్ జర్నీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. జనసేనకు చిరంజీవి అండ తోడైతే సరికొత్త రాజకీయాలను నిర్మిస్తామని కూడా చెప్పారు. సినిమాల్లో కాదు.. నిజ జీవితంలో కూడా చిరంజీవి గాడ్ ఫాదర్ అని కొనియాడారు. ఆయన వారసులుగా వచ్చిన వారు ఆయన స్థాయిని దాటి పోయిన విషయాన్ని గుర్తుచేశారు. అదే మోహన్ బాబును తీసుకుంటే ఆయన కుమారులు ఆయన స్థాయిని మాత్రం చేరుకోలేకపోయారని కూడా ప్రస్తావించారు.కానీ చిరంజీవి విషయంలో మాత్రం అటువంటి పరిస్థితి లేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో మెగా కంపౌండ్ హీరోలంతా జనసేనకు మద్దతుగా ప్రచారం చేస్తారని బొలిశెట్టి దీమా వ్యక్తం చేశారు. వారంతా పవన్ వెంటే నడుస్తున్నారని.. వారికి పవన్ అంటే ప్రాణమన్నారు. వారంతా ఒకటే మాట మీద ఉంటారని చెప్పారు. చిరంజీవి అభిమానులు కూడా పవన్ కు మద్దతిస్తారని చెప్పారు. ఇప్పటికే 5 వేల మంది మెగా అభిమానులు జనసేనలో చేరిన విషయాన్ని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేనను అధికారంలోకి తెచ్చేందుకు వారంతా రంగంలోకి దిగుతారన్నారు. ప్రజారాజ్యంతో నేర్చుకున్న గుణపాఠాలతో ఏపీలో పవన్ ను అధికారంలోకి తీసుకురావడం ఖాయమని తేల్చిచెప్పారు.
Also Read; RRR Oscar: ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ఆశలు ఇంకా బ్రతికే ఉన్నాయి… ఇలా బరిలో దిగవచ్చు!
Recommended videos: