రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. రుణాలు మాఫీ..?

తమిళనాడు రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 12,110 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను రద్దు చేసింది. రైతులకు భారీ ఊరట కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రైతుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 16.43 లక్షల మంది రైతులకు ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. Also Read: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,100కే కొత్త […]

Written By: Navya, Updated On : February 5, 2021 3:04 pm
Follow us on

తమిళనాడు రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 12,110 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను రద్దు చేసింది. రైతులకు భారీ ఊరట కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రైతుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 16.43 లక్షల మంది రైతులకు ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

Also Read: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,100కే కొత్త స్మార్ట్‌ఫోన్..?

తమిళనాడు సీఎం పళనిస్వామి అసెంబ్లీ రైతుల రుణాల మాఫీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ఏడాది ఏప్రిల్ నెల రెండవ వారంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనుందని తెలుస్తోంది. ఎన్నికలకు రెండు నెలల ముందు పెద్ద మొత్తంలో వ్యవసాయ రుణాలను రద్దు చేసి పళనిస్వామి సర్కార్ ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. సీఎం పళనిస్వామి సహకార బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తున్నట్టు తెలిపారు.

Also Read: ఆ ఊరిలో ఆకుకూరలు అమ్ముతున్న సర్పంచ్.. ఎందుకంటే..?

కొన్ని రోజుల క్రితం అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రయోజనం చేకూరేలా సీఎం పళనిస్వామి నష్ట పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 1,117 కోట్ల రూపాయల పరిహారం వల్ల 11 లక్షల మంది రైతులకు పళనిస్వామి ప్రయోజనం చేకూరేలా చేశారు. రైతులకు మేలు చేసేలా పళనిస్వామి తీసుకున్న నిర్ణయాల వల్ల రాబోయే ఎన్నికల్లో రైతుల ఓట్లన్నీ పళనిస్వామి సర్కార్ కే పడే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

2020 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రాన్ని అకాల వర్షాలు ముంచెత్తాయి. సాధారణ వర్షపాతంతో పోల్చి చూస్తే 708 శాతం అధిక వర్షపాత్రం నమోదైంది. ఎడతెరపి లేని వర్షాలు రైతులకు భారీ నష్టాలను మిగల్చడంతో నష్టపరిహారం ప్రకటించి పళనిస్వామి రైతులను ఆదుకున్నారు.