
ప్రధానులు, అధ్యక్షులు, సీఎంలన్నాక ప్రజల వద్దకు వెళ్లడం.. వారితో కలిసిపోవడం సర్వసాధారణం. కానీ ఓ అధ్యక్షుడికి తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మన్యూయేల్ మైక్రాన్ చెంప చెల్లుమని పగిలింది. అధ్యక్షుడికి చేదు అనుభవం ఎదురైంది.
ఫ్రాన్స్ లోని డ్రోమ్ ప్రాంతంలో వాహనం దిగి ప్రజలకు నమస్కరిస్తూ కరచాలనం చేసేందుకు వెళ్లిన ఫ్రాన్స్ అధ్యక్షుడిని బారికేడ్ల అవతల ఉన్న ఓ యువకుడు ఒక్కసారిగా ఆయన చెంపపై గట్టిగా కొట్టాడు. దీంతో అధ్యక్షుడు ఒక్కసారిగా షాక్ అయిపోయి నిర్ఘాంతపోయాడు. ఇక పోలీసులు మెరుపు వేగంతో వచ్చి అధ్యక్షుడిని వెనక్కి తీసుకెళ్లిపోయారు. యువకుడితోపాటు మరొకరిని అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. వారిని ప్రత్యేకంగా విచారిస్తున్నారు.
ఫ్రాన్స్ లో వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు మైక్రాన్ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. రెండో పర్యటనలోనే ఓ యువకుడిని ఇలా ఫ్రాన్స్ అధ్యక్షుడికి చేదు అనుభవం ఎదురవడం అధికార పార్టీకి మింగుడుపడడం లేదు.
🇫🇷 FLASH | En déplacement dans la #Drôme ce mardi dans le cadre de son tour de #France des territoires, Emmanuel #Macron s’est fait violemment gifler, deux personnes ont été interpellées.
(BFM) #MacronGiflé pic.twitter.com/3pjWQt0NAR
— Cerfia (@CerfiaFR) June 8, 2021