Hailstorm Vikarabad : కాలం మారింది.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. తెలంగాణలో ఇప్పుడు వేసవి కాలం. కానీ మొత్తం మేఘాలు కమ్మి వడగండ్లు కొడుతున్నాయి. మంచు దుప్పటిలా వీధులన్నీ నిండిపోతున్నాయి. కాలం కాని కాలాలు వచ్చిపడుతున్నాయి. చూస్తుంటే ప్రకృతి వైపరీత్యాలు మరింత దారుణంగా ఈ ప్రపంచాన్ని కబళిస్తాయని తెలంగాణలో పడ్డ వడగండ్ల వానలు, ఆకాలవర్షాలు చూస్తుంటే అర్థమవుతోంది.
తెలంగాణ అమెరికా అయిపోయింది. అమెరికాలో ఇటీవల మంచు తుఫాన్ ఎలా కురిసిందో తెలంగాణలోనూ అలాంటి వడగండ్లు కురిశాయి. ఆ మంచు ముద్దలు పడి అమెరికాలో మంచుమయం అయిపోయింది. వడగండ్లకు తెలంగాణలోని కూరగాయలు, పంట పొలాలకు తీవ్రనష్టం వాటిల్లింది. మొత్తం అమెరికాలో మంచుతో కప్పబడి చూడడానికి ఆహ్లాదంగా కనిపించింది. ప్రకృతి ప్రకోపిస్తే ఇంతటి వేసవి కాలంలో అంతటి మంచుతో కూడిన వడగండ్లు ఎలా పడుతాయో జనాలు కళ్లారా చూశారు.
వికారాబాద్ జిల్లాలోని మార్పల్లిలో వడగండ్ల వాన భారీ ఎత్తున కురిసింది. దీంతో ఆ ప్రాంతం అంతా మంచు ప్రదేశంలా మారిపోయింది. కశ్మీర్ ను తలపించేలా మంచు వర్షం వడగండ్లలా కురిసింది. అమెరికాలో ఈ మధ్యన కురిసిన మంచు తుఫాన్ లా మర్పల్లి వీధులు, పొలాలు, గ్రామ పరిసరాలు కనిపించాయి. ఈ వాతావరణాన్ని స్థానిక ప్రజలు తెగ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో వాతావరణ శాఖ అరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేసింది. మార్చి 15, 16, 17, 18 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని అధికారులు వెల్లడించారు.
పగటిపూట ఎండ, సాయంత్రానికి వర్షాలు పడుతాయని అధికారులు వివరించారు. 16న తెలంగాణలోని ఉత్తర, పశ్చిమ, మధ్య, దక్షిణ జిల్లాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని.. 17,18 తేదీల్లో ఉత్తర , ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.