https://oktelugu.com/

వైరల్: భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు, మనుషులు

భారత్ లోనే కాదు.. వర్షాలు గతంలో ఎన్నడూ లేని విధంగా చైనాలోనూ విరుచుకుపడుతున్నాయి. గత 1000 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో చైనాలో కుంభవృష్టి వానలు కురిశాయి.దీంతో భీకర వరదపోటెత్తుతోంది. చైనాలోని హెనన్ ప్రావిన్స్ లో భారీ వర్షాలు ముంచెత్తాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈ వరద ఉధృతికి కార్లు, మనుషులు కొట్టుకుపోతున్న వీడియోలు వైరల్ గా మారాయి. ఇప్పటివరకు 12 మంది చనిపోగా.. మరో లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చైనాలో […]

Written By:
  • NARESH
  • , Updated On : July 21, 2021 / 12:18 PM IST
    Follow us on

    భారత్ లోనే కాదు.. వర్షాలు గతంలో ఎన్నడూ లేని విధంగా చైనాలోనూ విరుచుకుపడుతున్నాయి. గత 1000 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో చైనాలో కుంభవృష్టి వానలు కురిశాయి.దీంతో భీకర వరదపోటెత్తుతోంది.

    చైనాలోని హెనన్ ప్రావిన్స్ లో భారీ వర్షాలు ముంచెత్తాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈ వరద ఉధృతికి కార్లు, మనుషులు కొట్టుకుపోతున్న వీడియోలు వైరల్ గా మారాయి. ఇప్పటివరకు 12 మంది చనిపోగా.. మరో లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

    చైనాలో ఇలాంటి వరదలు గత 1000 సంవత్సరాల్లో రాలేదంటే అతిశయోక్తి కాదు.. కరోనాను పుట్టించిన ఆ దేశంలో ఇప్పుడు వరదలు కల్లోలం సృష్టిస్తున్నాయి. భారీ వ్యాపారకార్యకలాపాలకు నిలయమైన హెనన్ ప్రావిన్స్ ఇప్పుడు అతలాకుతలం అవుతోంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వరద పోటెత్తి కార్లు నీటిపై తేలుతూ కొట్టుకుపోతున్నాయి.

    మంగళవారం ఒక్కరోజే జెంగ్జౌ నగరంలో 45.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత 1000 ఏళ్లలో చైనాలో ఇంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదని అక్కడి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

    భారీ వర్షాలతో చైనాలోని నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వీదులన్నీ నదుల వలే తలపిస్తున్నాయి. కార్లు నీటిపై పడవల్ల కొట్టుకుపోతున్న తీరు భయానకంగా కనిపిస్తోంది. హెనన్ లో ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. జెంగ్జోకు పశ్చిమాన ఉన్న యిహెతన్ డ్యామ్ కూలిపోయేలా కనిపిస్తోందని అధికారులు తెలిపారు. రైళ్లు, రైల్వే స్టేషన్లలో నడుం లోతు నీళ్లు వచ్చాయి. వాటిల్లో జనం నానా యాతన పడుతున్నారు. వరదలో రైళ్లు ఆగిపోయి లాక్ అయిపోయి అందులో నడుం లోతు నీళ్లలో జనం భయంభయంగా గడుపుతున్న ప్రజల వీడియోలు వైరల్ గా మారాయి.