దేశంలో కరోనా మరణాలు ఎన్నో తెలిస్తే షాకే?

భారత్ లో కరోనా ప్రభావం పెను ప్రమాదాన్ని సృష్టించింది. కరోనా వైరస్ రెండు దశల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి తగ్గుతోంది. కానీ రెండు మూడు స్టేట్లు మినహా దాదాపుగా అన్ని చోట్ల సాధారణ కేసులు నమోదవుతున్నాయి. కొత్త కేసులు కానీ మరణాలు కానీ నమోదు కావడం లేదు. రోజువారీ కొత్త కేసుల సంఖ్య పరిమితంగా ఉంటున్నాయి. డెల్టా వేరియంట్ కొంత ఆందోళన కరంగా మారినప్పటికి కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటోంది. ఎప్పటికప్పుడు తాజా […]

Written By: Srinivas, Updated On : July 21, 2021 12:31 pm
Follow us on

భారత్ లో కరోనా ప్రభావం పెను ప్రమాదాన్ని సృష్టించింది. కరోనా వైరస్ రెండు దశల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి తగ్గుతోంది. కానీ రెండు మూడు స్టేట్లు మినహా దాదాపుగా అన్ని చోట్ల సాధారణ కేసులు నమోదవుతున్నాయి. కొత్త కేసులు కానీ మరణాలు కానీ నమోదు కావడం లేదు. రోజువారీ కొత్త కేసుల సంఖ్య పరిమితంగా ఉంటున్నాయి. డెల్టా వేరియంట్ కొంత ఆందోళన కరంగా మారినప్పటికి కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటోంది. ఎప్పటికప్పుడు తాజా మార్గదర్శకాలు జారీ చేస్తోంది. సెకండ్ వేవ్ లో నమోదైన కరోనా మరణాలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. మరణాల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం తగ్గించి చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికాకు చెందిన ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఓ కథనం ఈరకమైన చర్చకు దారి తీసింది. భారత్ లో కరోనా మరణాలు ఇప్పుడు కేంద్రం చూపిస్తోన్న సంఖ్య కంటే కనీసం పది రెట్లు అధికంగా ఉండొచ్చని పేర్కొంది. మూడు మిలియన్ల నుంచి కరోనా బారిన పడి మరణించి ఉండొచ్చని తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన సందర్భాలు, పరిస్థితులు భారత్ లో తలెత్తిందని వ్యాఖ్యానించింది.

వాషింగ్టన్ ప్రధాన కేంద్రంగా పని చేస్తోన్న సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్ మెంట్ అనే రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ చేసిన పరిశోధనలను తన కథనంలో ఉటంకించింది. ది న్యూయార్క్ టైమ్స్ కరోనా వైరస్ సెకండ్ వేవ్ సమయంలో భారత్ లో నెలకొన్న సంక్షోభానికి సంబంధించిన డేటా, అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు, సీరియాలజిక్ స్టడీస్, ఇంటింటి సర్వే, వాస్తవ కరోనా మరణాల సంఖ్యను ప్రతిబింబిస్తోన్నాయని, అధికారిక లెక్కల కంటే సుమారు 10 రెట్లు అధికంగా ఉండొచ్చని అంచనా వేసినట్లు స్పష్టం చేసింది. భారత్ లోకరోనా మరణాల సంఖ్య మూడు మిలియన్ల వరకు ఉండొచ్చని పేర్కొంది.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ను ఉటంకిస్తూ కరోనా సెకండ్ వేవ్ సమయంలో వందలు, వేలల్లో కాదు మిలియన్ల సంఖ్యలో ప్రజలు మరణించి ఉంటారని న్యూయార్క్ టైమ్స పేర్కొంది. కరోనా మరణాల విషయంలో ప్రభుత్వం ప్రకటించిన లెక్కలు ప్రతి సారి పలు ప్రశ్నలు ఉత్పన్నం అయ్యేవని తెలిపింది. శ్మశానాల్లోని చితిమంటలు, గంగానదిలో కొట్టుకుని వచ్చిన మృతదేహాలు, వాస్తవ మరణాల సంఖ్యను భారత ప్రభుత్వం తొక్కి పెట్టిందనే విషయాన్ని స్పష్టం చేశాయని వ్యాఖ్యానించింది.