https://oktelugu.com/

వైరల్: మెదడుకు ఆపరేషన్.. హనుమాన్ చాలీసా చదివిన యువతి

ఢిల్లీలోని ఎయిమ్స్ లో అద్భుతం జరిగింది. ఒక యువతికి బ్రెయిన్ ట్యూమర్ శస్త్రచికిత్స చేస్తుండగా హనుమాన్ చాలీసా మంత్రి చదువుతూ మూడు గంటల పాటు ఆపరేషన్ చేయించుకుంది. ఈ వీడియోను వైద్యులు పంచుకోవడంతో వైరల్ గా మారింది. 24 సంవత్సరాల యుక్తి అగర్వాల్ కు బ్రెయిన్ ట్యూమర్. ఈ క్రమంలోనే నొప్పి తెలియకుండా మందులు, పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. కానీ ఆపరేషన్ సమయంలో నిద్రపోతే మెదడుకు ప్రమాదం.. కోమాలోకి వెళ్లిపోతారు. అందుకే ఆ సమయంలో మెలకువగా ఉండాలని […]

Written By:
  • NARESH
  • , Updated On : July 25, 2021 / 12:28 PM IST
    Follow us on

    ఢిల్లీలోని ఎయిమ్స్ లో అద్భుతం జరిగింది. ఒక యువతికి బ్రెయిన్ ట్యూమర్ శస్త్రచికిత్స చేస్తుండగా హనుమాన్ చాలీసా మంత్రి చదువుతూ మూడు గంటల పాటు ఆపరేషన్ చేయించుకుంది. ఈ వీడియోను వైద్యులు పంచుకోవడంతో వైరల్ గా మారింది.

    24 సంవత్సరాల యుక్తి అగర్వాల్ కు బ్రెయిన్ ట్యూమర్. ఈ క్రమంలోనే నొప్పి తెలియకుండా మందులు, పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. కానీ ఆపరేషన్ సమయంలో నిద్రపోతే మెదడుకు ప్రమాదం.. కోమాలోకి వెళ్లిపోతారు. అందుకే ఆ సమయంలో మెలకువగా ఉండాలని వైద్యులు సూచించారు.

    దీనికి సరేనన్న యువతి.. ఆపరేషన్ జరుగుతున్నంత సేపు దైవ భక్తిలో మునిగిపోయింది. ఆ దేవుడిని తలుచుకొని హనుమాన్ చాలీసా చదువుతూ కాలం గడిపింది. మూడు గంటలు ఆపరేషన్ పూర్తి కావడంతో బతికి బట్టకట్టింది.

    ఆపరేషన్ జరుగుతున్న వీడియోను వైద్యులు వీడియో తీసి ట్విట్టర్ లో పంచుకోవడం తో వైరల్ గా మారింది. ఇదో అరుదైన ఆపరేషన్ అని.. మెదడుకు జరిగే ఇలాంటి ఆపరేషన్లలో రోగి నిద్రపోకూడదని.. అందుకే అలా చేశామని వైద్యులు క్లారిటీ ఇచ్చారు.