Vinayaka Chavithi:వినాయక ఉత్సవాలు: జగన్ ను టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు

Vinayaka Chavithi Festival: ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి వేడి పుట్టిస్తోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వినాయక విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేయడానికి వీలు లేదని ప్రభుత్వం చెప్పడంతో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. జగన్ సర్కారుపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నాయి. జగన్ ను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేస్తున్నాయి. ఏ పండుగలకు లేని నిబంధనలు వినాయక చవితికి ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. కరోనా సాకు చూపి పండుగను నిర్వహించుకోవడానికి అడ్డంకులు సృష్టించడంపై […]

Written By: Srinivas, Updated On : September 7, 2021 6:58 pm
Follow us on

Vinayaka Chavithi Festival: ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి వేడి పుట్టిస్తోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వినాయక విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేయడానికి వీలు లేదని ప్రభుత్వం చెప్పడంతో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. జగన్ సర్కారుపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నాయి. జగన్ ను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేస్తున్నాయి. ఏ పండుగలకు లేని నిబంధనలు వినాయక చవితికి ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. కరోనా సాకు చూపి పండుగను నిర్వహించుకోవడానికి అడ్డంకులు సృష్టించడంపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు.

సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక చాలా సందర్భాల్లో హిందూ వ్యతిరేకిగా విమర్శలు ఎదుర్కొన్న విషయం విదితమే. ప్రస్తుతం కూడా ఆయనపై వెల్లువలా ఆరోపణలు వస్తున్నాయి. జగన ను టార్గెట్ గా చేసుకుని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. బీజేపీ రాష్ర్టవ్యాప్తంగా పండుగకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆందోళనలు చేపడుతోంది. తెలుగుదేశం పార్టీ కూడా వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.

టీడీపీ నాయకుడు లోకేష్ సీఎం జగన్ కు లేఖ రాశారు. భక్తుల మనోభావాలు గౌరవించాలని సూచించారు. పండుగ నిర్వహణకు అనవసరంగా అడ్డంకులు పెట్టి చులకన కావొద్దని హితవు పలికారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించరాదని చెబుతున్నారు. కరోనా నిబంధనలను సాకుగా చూపి ఉత్సవాలకు బ్రేక్ వేయడం తగదని వివరించారు. విఘ్నాలు తొలగించే వినాయకుడి ఉత్సవాలకే విఘ్నాలు సృష్టించడం సమంజసం కాదన్నారు.

మద్యం దుకాణాలు, బార్లు, స్కూళ్లు అన్ని తెరిచి పండుగకు అడ్డు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. వినాయక చవితి విషయంలో ప్రభుత్వం బేషజాలకు పోకుండా హిందువుల మనోభావాలు గౌరవించాలని సూచిస్తున్నారు. జగన్ ప్రభుత్వం మొండి నిర్ణయాలు తీసుకుంటే తగిన గుణపాఠం చెబుతామని సమాధానం చెబుతున్నారు. దీంతో జగన్ వెనక్కి తగ్గుతారా? లేక ఆయన మాటే నెగ్గించుకుంటారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.