https://oktelugu.com/

Priya Prakash Varrier: స్టార్ హీరోల కోసం యంగ్ బ్యూటీ ఆరాటం !

Priya Prakash Varrier: ఓవర్ నైట్ లోనే స్టార్ అవ్వడం అంటే ఏమిటో ‘ప్రియా ప్రకాష్ వారియర్’ ( Priya Prakash Varrier) కెరీర్ ను చూసి తెలుసుకోవచ్చు. ఒక్క చిన్న వీడియోతో ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ యంగ్ మలయాళ బ్యూటీ పరిస్థితి ప్రస్తుతం బాగాలేదు. నిజానికి ‘ప్రియా ప్రకాష్ వారియర్’ స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. ఆమెకు నేషనల్ వైడ్ గా ఫుల్ పాపులారిటీ దక్కింది. కానీ ఎక్కువ రెమ్యునరేషన్ కోసం ఆశ పడటం, […]

Written By: , Updated On : September 7, 2021 / 06:39 PM IST
Follow us on

Priya Prakash Varrier

Priya Prakash Varrier: ఓవర్ నైట్ లోనే స్టార్ అవ్వడం అంటే ఏమిటో ‘ప్రియా ప్రకాష్ వారియర్’ ( Priya Prakash Varrier) కెరీర్ ను చూసి తెలుసుకోవచ్చు. ఒక్క చిన్న వీడియోతో ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ యంగ్ మలయాళ బ్యూటీ పరిస్థితి ప్రస్తుతం బాగాలేదు. నిజానికి ‘ప్రియా ప్రకాష్ వారియర్’ స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. ఆమెకు నేషనల్ వైడ్ గా ఫుల్ పాపులారిటీ దక్కింది.

కానీ ఎక్కువ రెమ్యునరేషన్ కోసం ఆశ పడటం, సరిగ్గా కెరీర్ ను ప్లాన్ చేసుకోలేకపోవడంతో అమ్మడుకు చివరకు అవకాశాలు తగ్గాయి. అయితే, అంతా అయిపోయాక తత్వం బోధపడింది. ఇప్పటి వరకు ఈ యంగ్ బ్యూటీ ఎక్కువుగా సెకెండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితం అయింది. ఇప్పుడు వస్తోన్న పాత్రలు కూడా ఎక్కువగా సెకెండ్ హీరోయిన్ పాత్రలేనట.

ఇక ఇప్పుడు కూడా సెకండ్ హీరోయిన్ గా చేస్తే.. భవిష్యత్తులో అలాంటి పాత్రలకే పరిమితం అయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే ప్రియా తన కెరీర్ ను మలుచుకోవడానికి కసరత్తులు చేస్తోంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ లో వచ్చిన ఫుల్ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి పక్కా ప్లాన్ తో ముందుకు పోతుంది.

వాస్తవానికి తనకు వచ్చిన స్టార్ డమ్ ను మెయింటైన్ చేయడంలో ప్రియా విఫలం అయింది. మొదట్లో వచ్చిన ఆఫర్స్ ను సరిగ్గా వాడుకోలేదు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే మకాం పెట్టి మరి, కొన్ని ప్రొడక్షన్ హౌస్ లకు రెగ్యులర్ గా వెళ్తూ.. అవకాశాలను అడుగుతుందట. తనకు స్టార్ డమ్ రావాలంటే స్టార్ హీరోల సినిమాల్లోనే నటించాలనే అవగాహనకు వచ్చింది.

అందుకే నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలతో రెగ్యులర్ గా టచ్ లోకి వెళ్తుందట. మరి ఈ భామ స్టార్ హీరోయిన్ గా ఎదగాలి అంటే.. ఒక్క స్టార్ హీరో అయినా ఛాన్స్ ఇవ్వాలి. ఇచ్చినా తన నటనతో గాని ప్రియా మెప్పించగలగాలి. మరి ఇవ్వన్నీ జరుగుతాయా ?