Mysterious village: భారతదేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు అని అంటారు. దేశంలో 6.65 లక్షల గ్రామాలు ఉన్నట్లు ఒక అంచనా. వీటిలో వివిధ ప్రదేశాల్లో ప్రజల జీవనం విభిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లోనే వాతావరణ పరిస్థితులను బట్టి అక్కడ ఆదాయాన్ని.. ఆహార వనరులను సమకూర్చుకుంటారు. ఒక గ్రామానికి మరో గ్రామం కచ్చితంగా లింక్ అయి ఉంటుంది. కానీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామం ఒంటరిగా జీవిస్తోంది. మూడు నెలలపాటు ఈ గ్రామంలోని వారు ఇంట్లో నుంచి బయటకు వెళ్లరు. కానీ ఈ గ్రామం అందమైన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. మరి ఈ గ్రామం ఎక్కడ ఉంది? ఈ గ్రామ ప్రత్యేకత ఏంటి? ఇక్కడికి ఎప్పుడు వెళ్లాలి? ఎప్పుడు వెళ్లకూడదు?
Also Read: నిమిషానికి 700 బుల్లెట్లు..ఇండియాను గెలుక్కుంటే అంతే సంగతులు..
హిమాచల్ ప్రదేశ్ లోని ప్యాంఘి లోయలో కిల్లర్ పట్టణానికి సమీపంలో సురల్ బటోరి అనే గ్రామం ఉంది. ఈ గ్రామం మిగతా గ్రామాలతో సంబంధం లేకుండా కొనసాగుతుంది. 40 నివాస గృహాలు ఉన్న ఈ గ్రామంలో నవంబర్ నుంచి మార్చి వరకు పూర్తిగా మంచు వాతావరణం ఉంటుంది. మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రతతో కొనసాగడంతో ఇక్కడ పూర్తిగా మంచు పడుతుంది. దీంతో ఇంట్లో నుంచి దాదాపు మూడు నెలల పాటు ప్రజలు బయటకు రారు. అయితే వీరు అప్పటికే మూడు నెలల పాటు నిల్వ ఉండే ఆహారాన్ని తయారు చేసుకుంటారు. ప్రత్యేకంగా పికిల్స్ ను తయారు చేసుకొని ఈ మూడు నెలల పాటు తింటూ ఉంటారు. అంతేకాకుండా ఎండిన మాంసాహారాన్ని నిల్వ చేసుకుంటూ ఉంటారు.
ఆ తర్వాత జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఇక్కడి వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. పచ్చిక బయల్లతో మనసుకు ఉల్లాసాన్నిచ్చే ఇక్కడికి రావడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తారు. బిర్జు అడవులతో ఈ సమయంలో పచ్చదనం నిండుకుంటుంది. అంతేకాకుండా ఇక్కడ చేతికి అందే అంత మేఘాలు ఉంటాయి. అందమైన జలపాతాలు ఆకట్టుకుంటాయి. ఇక్కడున్న చాబీ జలపాతంలో 100 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు దిగుతుంది. మరి ఇక్కడికి వెళ్లాలంటే ఎలా వెళ్లాలి?
సురల్ bhatori గ్రామానికి వెళ్లాలంటే ఢిల్లీ నుంచి వెళ్లవచ్చు. లేదా చండీగఢ్ నుంచి ట్రైన్ ద్వారా Killaar పట్టణానికి వెళ్లాలి. అక్కడ నుంచి బస్సు ద్వారా గంట ప్రయాణంలో ఈ గ్రామానికి చేరుకుంటారు. ఇక్కడికి రోడ్డు మార్గం ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. అయితే చాలా జాగ్రత్తలు తీసుకునే వెళ్లాలి. ఎందుకంటే ఇక్కడ సరైన ఆహారం లభించే అవకాశం ఉండదు. అందువల్ల వెంట ఆహారం తీసుకొని వెళ్లాలి. ట్రెక్కింగ్ ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. అయితే ఆరోగ్యకరమైన వారు మాత్రమే ఆ ప్రయత్నం చేయాలి.
Also Read: రాముడి లీలేనా? గంగలో తేలిన రామసేతు ‘రాయి’.. అద్భుత వీడియో
సురల్ bhatori గ్రామ ప్రజలు బౌద్ధ మతాన్ని ఎక్కువగా ఆరాధిస్తారు. కేవలం కొన్ని నెలల్లో మాత్రమే ప్రజలు ఒకరినొకరు కలుసుకుంటూ ఉంటారు. నవంబర్ నుంచి ఎవరి ఇళ్లల్లో వారే ఉండిపోతారు. అందువల్ల ఎక్కడి వారికి కాస్త కమ్యూనికేషన్ తక్కువగానే ఉంటుంది.