Jagan Liquor Scam: ఏపీలో మద్యం కుంభకోణం(liquor scam ) ప్రకంపనలు రేపుతోంది. ఎంపీ మిధున్ రెడ్డి అరెస్టుతో పతాక స్థాయికి చేరింది. ఇప్పటివరకు ఈ కేసులో 12 మంది నిందితులు అరెస్టు అయ్యారు. అయితే ఈ కేసులో ఏ2 గా ఉన్న ఏపీ బేవరేజెస్ మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి, మరో అధికారి సత్య ప్రసాద్ మాత్రం అరెస్టు కాలేదు. వారిద్దరూ అప్రూవర్లుగా మారుతారని ప్రచారం జరుగుతోంది. ఒక పద్ధతి ప్రకారం వారిని అప్రూవర్లుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ కేసు మరింతగా బిగించే ప్రయత్నాల్లో భాగంగా.. వారిద్దరిని కోర్టు ఎదుట అప్రూవర్లుగా మార్చేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
మద్యం పాలసీలో కీలక పాత్ర..
వైసీపీ హయాంలో ఏపీ బేవరేజెస్ చైర్మన్ గా వాసుదేవ రెడ్డి ఉండేవారు. ఏపీ మద్యం పాలసీ కోసం ఆయనను కేంద్ర సర్వీస్ ల నుంచి ఏపీకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో మద్యం పాలసీ రూపకల్పనలో వాసుదేవ రెడ్డి పాత్ర ఉన్నట్లు సమాచారం. అప్పట్లో సీఎం జగన్ ఆదేశాలతో డిస్టలరీలు, డిపోలు, మద్యం షాపులపై వాసుదేవరెడ్డి తన హవా సాగించాలని.. జే బ్రాండ్లు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారన్న అభియోగాలు వాసుదేవరెడ్డి పై ఉన్నాయి. మద్యం పేరుతో వైసిపి చేసిన దోపిడీకి కర్త, కర్మ క్రియ అన్ని తానై వ్యవహరించారని కూడా అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ఇంతకుముందు ఆయనను అదుపులోకి తీసుకొని కీలక సమాచారం రాబెట్టింది ఏపీ సిఐడి. ఆయనతో పాటు మరో ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్ ను సైతం అదే తరహాలో అదుపులోకి తీసుకొని వివరాలు తెలుసుకుంది.
Also Read: Pawan Kalyan Palle Bata: పవన్ కళ్యాణ్ చొరవతో తిరిగి ఆశలు చిగురించిన పల్లె జీవితం
ఆ ఆఫర్లతోనే..
అయితే వీరిద్దరి అరెస్టు జరగలేదు. ప్రస్తుతం ఆ ఇద్దరూ అప్రూవర్లు గా( approvers ) మారితే ముందస్తు బెయిల్ ఇవ్వడంతో పాటు సేఫ్ జోన్ లో ఉంచుతామని.. సిట్ తరఫున ప్రతిపాదనలు వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే వారు ఏసీబీ కోర్టుకు వెళ్లి తాము ఇద్దరం అప్రూవర్ గా మారుతున్నామని పిటీషన్లు దాఖలు చేసే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న న్యాయవాదులు, వైసిపి ప్రతినిధులతో మాట్లాడి ఆ పిటిషన్లు దాఖలు చేయకుండానే వెనుతిరిగారు. తరువాత సిట్ అధికారులు వారితో ప్రత్యేకంగా మాట్లాడినట్లు ప్రచారం నడుస్తోంది. గట్టిగానే హెచ్చరికలు జారీ చేయడంతో వారు హైకోర్టులో అప్రూవర్లు గా మారేందుకు పిటీషన్లు దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ అప్రూవర్ గా మారితే వాసుదేవరెడ్డిని తిరిగి కేంద్ర సర్వీసులోకి పంపించేందుకు ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. వారిద్దరిని అరెస్టు చేయకుండా.. కోర్టులో ముందస్తు బెయిల్ లభించేలా ఏర్పాట్లు చేసినట్లు టాక్ అయితే మాత్రం నడుస్తోంది. మరో ఛార్జ్ షీట్ ప్రత్యేక దర్యాప్తు బృందం 20 రోజుల్లో దాఖలు చేయనుంది. దీంతో ఈ మూడు వేల200 కోట్లకు సంబంధించి అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది తేలనుంది. ఆ ఇద్దరూ అప్రూవర్లుగా మారితే మాత్రం వైసీపీ నేతలు చాలా ప్రమాదంలో పడినట్టే.. చూడాలి మరి ఏం జరుగుతుందో?