https://oktelugu.com/

Actor Vijay TVK Rally : మహానాడులో విజయ్ స్పీచ్ అదుర్స్… టీవీఏ పార్టీ ఆశయాలు, భవిష్యత్తు లక్ష్యాలు ఇవే .

రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి తమిళ నటుడు విజయ్ మహానాడు పేరుతో ఆదివారం భారీ సభ నిర్వహించారు. తాను స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ మహానాడు సభను విల్లుపురం సమీపంలో నిర్వహించారు.

Written By:
  • NARESH
  • , Updated On : October 27, 2024 / 10:25 PM IST

    Actor Vijay TVK Rally

    Follow us on

    Actor Vijay TVK Rally : విజయ్ కి రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ.. ఒక సీనియర్ నాయకుడి లాగా ఆయన ప్రసంగించారు.. పదేపదే తమిళ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మాట్లాడారు. తమిళ కవుల కవితా పంక్తులను పలు సందర్భాల్లో గుర్తు చేశారు.. దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో ద్రవిడ సిద్ధాంతాలు ఎక్కువగా వ్యాప్తిలో ఉంటాయి. అక్కడ అధికారంలో ఉన్న డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే ద్రావిడ సిద్ధాంతాల ఆధారంగానే ఏర్పడ్డాయి. అందువల్ల అవి చాలా సందర్భాల్లో తమిళనాడు రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్నాయి. ఇప్పుడు విజయ్ కూడా ద్రావిడ సిద్ధాంతాన్ని పదే పదే ప్రస్తావించారు.. సభకు హాజరైన తన అభిమానులను, కార్యకర్తలను ఉద్దేశించి చాలా సేపు మాట్లాడారు. దాదాపు 90 నిమిషాల పాటు ఆయన ప్రసంగం సాగింది. పార్టీ ఏర్పాటు? భవిష్యత్తు లక్ష్యాలు? ఇప్పుడు నిర్దేశించుకున్న ఆశయాలు.. వంటి వాటిపై ప్రసంగించారు.

    అందుకోసమే రాజకీయాల్లోకి..

    తాను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను? కెరియర్ పీక్ లో ఉన్నప్పుడు కూడా దాన్ని వదిలిపెట్టుకొని.. పొలిటికల్ ఎంట్రీ ఎందుకు ఇచ్చాను? అనే విషయాలపై విజయ్ స్పష్టత ఇచ్చారు..” ద్రావిడ, తమిళ జాతీయ వాద సిద్ధాంతాలు కచ్చితంగా అనుసరిస్తాం. తమిళ గడ్డకు ఇవి అత్యంత ముఖ్యం. సామాజిక, న్యాయ సిద్ధాంతాలు మా పార్టీ భావజాలం. వాటి పునాదుల మీదే పనిచేస్తాం. పెరియార్ ఇవి రామస్వామి, కె కామరాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్, వేలు నాచియార్, అంజలి అమ్నాళ్ ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చాం. విలువలు కాపాడుతాం. విలువలు పెంపొందిస్తాం. నాకు రాజకీయ అనుభవం లేదని చాలామంది అంటున్నారు. ఇంతమంది నన్ను అభిమానిస్తున్నప్పుడు.. ఇంతమంది నన్ను ప్రేమిస్తున్నప్పుడు నాకు కొత్తగా అనుభవం ఏముంటుంది? కొత్తగా రాజకీయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడికి నేను ఈ యాక్టర్ విజయ్ గా రాలేదు. మీ విజయ్ గా వచ్చాను. ఇక్కడ నిలబడ్డాను. నాకు రాజకీయ అనుభవం లేదన్న వాళ్ళు పిచ్చివాళ్లు. వాళ్లు మనల్ని ఆడిస్తున్నారు. పాముతో ఆడుకునే పిల్లల్లాగా మనల్ని పరిగణిస్తున్నారని” విజయ్ వ్యాఖ్యానించారు.

    విజయ్ ప్రసంగం అదుర్స్

    మహానాడు వేదికగా విజయ చేసిన ప్రసంగం ఆకట్టుకున్నది. తన రాజకీయ ప్రయాణాన్ని.. సినీ రంగ ప్రయాణంతో ముడిపెట్టి ప్రసంగించారు. తాను ఎదుర్కొన్న బాధలను.. పడిన ఇబ్బందులను ఉద్వేగంగా చెప్పారు. ఆయన ప్రసంగానికి అభిమానులు, పార్టీ కార్యకర్తలు కనెక్ట్ అయ్యారు. అంతేకాదు పార్టీకి సంబంధించి భవిష్యత్తు లక్ష్యాలను విజయ్ వెల్లడిస్తున్నప్పుడు పార్టీ కార్యకర్తలు, అభిమానులు చప్పట్లు కొట్టారు. దీంతో విజయ్ రెట్టించిన ఉత్సాహంతో ప్రసంగించారు. ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమంలో తమిళనాడు నుంచి పాల్గొన్న వారి పేర్లు విజయ్ చెబుతున్నప్పుడు పార్టీ కార్యకర్తల నుంచి విశేషమైన స్పందన లభించింది.