Actor Vijay TVK Rally : డీఎంకేను అధికారంలోకి తేవడమే విజయ్ లక్ష్యం. అందుకే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. దానికి తగ్గట్టుగానే బిజెపిపై విమర్శలు చేస్తున్నారు. అన్నా డీఎంకేను మరింత పతనం చేస్తున్నారు.. టీవీఏ పార్టీని విజయ్ ప్రకటించినప్పుడు వివిధ పార్టీల నాయకుల నుంచి వచ్చిన విమర్శలు..అయితే ఈ విమర్శలకు టీవీఏ మహానాడులో విజయ్ సమర్థవంతంగా మాట్లాడారు. పొత్తులపై స్పష్టతనిచ్చారు. కేంద్రం అమలు చేస్తున్న నీట్ వంటి పరీక్షలపై తన వైఖరిని వెల్లడించారు. ” అరియలురు ప్రాంతంలో నీటి విద్యార్థిని అనిత ఆత్మహత్య చేసుకుంది. మా పార్టీ నీట్ కు పూర్తి వ్యతిరేకం. ఈ సభ వేదికగానే పార్టీ విధానాన్ని వెల్లడిస్తున్నాను. నీట్ పరీక్షను రద్దు చేయాల్సిందే. నన్ను ఆర్టిస్ట్ అంటూ చాలామంది విమర్శిస్తున్నారు. ప్రస్తుతం నా సినిమా కెరియర్ అత్యంత అద్భుతంగా ఉంది. దాన్ని కూడా నేను వదిలేసాను. కేవలం ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను. నా సినిమా కెరియర్ మొదలైనప్పుడు చాలామంది అవమానించారు. వాటన్నింటినీ నేను తట్టుకున్నాను. ధైర్యంగా నిలబడ్డాను. ఈరోజు మీ ముందు మీ విజయ్ గా నిలబడ్డాను. ఎంజీఆర్, ఎన్టీఆర్ కూడా తమ రాజకీయ ప్రారంభ జీవితంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఆ తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వారు ఎలాంటి సంచలనం సృష్టించారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల ప్రతి ఓటు చాలా విలువైనది. అది అత్యంత బలమైనది కూడా. అది వజ్రాయుధం కంటే శక్తివంతమైనది.. నేను ఏర్పాటు చేసిన పార్టీ తమిళనాడు రాజకీయాలను తీవ్రంగా శాసిస్తుంది. అత్యంత బలమైన ప్రభావాన్ని చూపిస్తుందని” విజయ్ వ్యాఖ్యానించారు.
పొత్తులపై స్పష్టత
2026 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే ఈ ఎన్నికల సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు తమదైన కార్యాచరణతో ముందడుగు వేస్తున్నాయి. ఇప్పటివరకు డీఎంకే వర్సెస్ అన్న డిఎంకె గా తమిళనాడులో రాజకీయాలు సాగాయి. ఇప్పుడు విజయ్ పార్టీ కూడా ఎంట్రీ ఇవ్వడంతో త్రిముఖ పోటీ ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే మహానాడు వేదికగా 2026 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి విజయ్ క్లారిటీ ఇచ్చారు. పొత్తు లపై చాలా స్పష్టమైన వైఖరిని వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమను పూర్తిస్థాయిలో గెలిపిస్తారని విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు తమతో పొత్తు పెట్టుకుంటే.. కచ్చితంగా అధికారంలో భాగస్వాములను చేస్తామని విజయ్ పేర్కొన్నారు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేకంటే.. సంయుక్తంగానే పోటీ చేస్తామని విజయ్ సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో అన్న డిఎంకె బీజేపీతో కలిసి పోటీ చేస్తుంది. మరోవైపు మహానాడు సభలో బిజెపి పై విజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ ప్రకారం ఆయన డిఎంకెతో కలిసి సాగుతారని.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారని తమిళ రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.