https://oktelugu.com/

Cheating: షార్ట్ ఫిల్మ్ చేయాలని పిలిచి.. కెమెరాలతో ఉడాయించి..

Cheating: మోసపోయే వాళ్లున్నంత కాలం మోసం చేసే వారుంటారు. ప్రస్తుతం మోసాలు కొత్తరకంగా జరుగుతున్నాయి. మోసకారులు తమ పద్ధతులు మారుస్తున్నారు. కొత్త తరహా మోసాలకు తెర తీస్తున్నారు. నమ్మిన వారినే నట్టేట ముంచుతున్నారు. మోసగాళ్ల చేతిలో నిత్యం మోసపోయే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నా నిర్లక్ష్య ధోరణితో మోసాలకు గురవుతున్నారు. తాజాగా విజయవాడలో వెలుగు చూసిన మోసం చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. షార్ట్ ఫిల్మ్ తీయాలని ఓ వ్యక్తి హైదరాబాద్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 17, 2021 / 04:11 PM IST
    Follow us on

    Cheating: మోసపోయే వాళ్లున్నంత కాలం మోసం చేసే వారుంటారు. ప్రస్తుతం మోసాలు కొత్తరకంగా జరుగుతున్నాయి. మోసకారులు తమ పద్ధతులు మారుస్తున్నారు. కొత్త తరహా మోసాలకు తెర తీస్తున్నారు. నమ్మిన వారినే నట్టేట ముంచుతున్నారు. మోసగాళ్ల చేతిలో నిత్యం మోసపోయే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నా నిర్లక్ష్య ధోరణితో మోసాలకు గురవుతున్నారు. తాజాగా విజయవాడలో వెలుగు చూసిన మోసం చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.

    Vijayawada Youth Cheating

    షార్ట్ ఫిల్మ్ తీయాలని ఓ వ్యక్తి హైదరాబాద్ నుంచి విజయవాడకు కెమెరాలను పిలిపించాడు. ఒప్పందం కుదిరాక హైదరాబాద్ నుంచి ఓ కెమెరామెన్ కెమెరాలతో విజయవాడ చేరుకున్నాడు. దీంతో వారు ఓ లాడ్జిలో బస చేశారు. తీరా ఫిల్మ్ తీసేందుకు వెళ్లేందుకు సిద్ధం కావడంతో భోజనం చేసేందుకు వెళ్లారు. కెమెరాలు అక్కడే పెట్టి కెమెరామెన్ భోజనం చేసేందుకు వెళ్లి తిరిగి రాగా కెమెరాలు కనిపించలేదు.

    దీంతో కంగారు పడిన కెమెరామెన్ ఆరా తీయగా కెమెరాలతో ఉడాయించారు. నమ్మి కెమెరాలను గదిలోనే వదిలి వెళ్లడంతో కెమెరాలు మాయమయ్యాయి. దీంతో లబోదిబోమన్నాడు. కెమెరాల ఖరీదు దాదాపు రూ.20 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. కెమెరాలు పోవడంతో కెమెరామెన్ తేరుకుని ఫోన్ చేసినా లాభం లేకుండా పోయింది.

    Also Read: Special status to AP: ఏపీకి ప్రత్యేక హోదా.. పుట్టుకొచ్చిన కొత్త ఆశ!

    ఎన్నిసార్లు ఫోన్ చేసినా అవతలి వ్యక్తి నుంచి సమాధానం రాలేదు. తరువాత స్విచాఫ్ అయింది. తేరుకుని మోసపోయానని గుర్తించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హోటల్లోని సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి తరహా మోసం నెల్లూరులో కూడా జరిగింది. చాకచక్యంగా కేటుగాళ్లు కెమెరాలను ఎత్తుకెళ్లడం సంచలనం సృష్టించింది.

    Also Read: పాలించే రాజుకు ఈ గుణం ఉంటే ఆ రాజ్యం సర్వనాశనమే..?

    Tags