https://oktelugu.com/

RRR Movie: రామ్, రామారావు ల కొత్త ఫోటోలు రిలీజ్ చేసిన “ఆర్‌ఆర్‌ఆర్” యూనిట్…

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా “ఆర్ ఆర్ ఆర్”. మెగా బుల్లోడు రామ్ చరణ్, నందమూరి కుర్రోడు ఎన్టీఆర్ కలిసి మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. నందమూరి, మెగా ఫ్యామిలిలకు మొదటి సారిగా కలిసి నటించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలానే చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… తారక్ కి జోడీగా హాలీవుడ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 17, 2021 / 04:12 PM IST
    Follow us on

    RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా “ఆర్ ఆర్ ఆర్”. మెగా బుల్లోడు రామ్ చరణ్, నందమూరి కుర్రోడు ఎన్టీఆర్ కలిసి మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. నందమూరి, మెగా ఫ్యామిలిలకు మొదటి సారిగా కలిసి నటించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలానే చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్… తారక్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో “ఆర్ఆర్ఆర్ ” టీం డిఫరెంట్ వేరియేషన్స్ లో ప్రమోషన్స్ ను చేస్తుంది.

    RRR Movie

    Also Read: ‘ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు’ ఆల్​టైమ్​ రికార్డు సెట్​ చేసిన తారక్​

    రాజమౌళి ప్రమోషన్స్ విధానం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఆయన ప్రతి సినిమాకీ ముందు ప్రెస్ మీట్ పెట్టి ఆ సినిమాపై ఊహాగానాలు పెంచేలా చేస్తారు. అక్కడే ఒక మెట్టు అధిగమిస్తారు రాజమౌళి. ఆ తర్వాత ఆ చిత్రం నుండి పోస్టర్, టీజర్ ఒకటి తర్వాత ఒకటి విడుదల చేసి అభిమానుల్లో ఇంకాస్త అంచనాలు పెంచుతుతారు. అయితే ఇదే తరుణంలో ఇటీవలే చరణ్ ఎన్టీఆర్ షూటింగ్ షెడ్యూల్ లో స్టైల్ లుక్స్ తో కూర్చొని ముచ్చటిస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా  మోటార్‌ సైకిల్‌పై ఎన్టీఆర్‌, వింటేజ్‌ లుక్‌లో రామ్‌చరణ్‌ ఫోటోలను మూవీ యూనిట్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

    Also Read: “పుష్ప” రాజ్ కు బెస్ట్ విషెస్ చెప్పిన చిట్టిబాబు ” రామ్ చరణ్ “…