https://oktelugu.com/

Bala Krishna: తిరుమల వెంకన్నను దర్శించుకున్న అఖండ మూవీ యూనిట్…

Bala Krishna: మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం “అఖండ”. ఈ ఏడాది డిసెంబర్ 2న విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయ బేరి మోగించింది.ఈ సందర్భంగా తిరుమల వెంకన్న దర్శించుకున్నారు చిత్ర బృందం. “అఖండ” చిత్రానికి వేంకటేశ్వరస్వామి అఖండమైన విజయాన్ని చేకూర్చారు అని బాలయ్య తెలిపారు. బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను‌, నిర్మాత రవీందర్‌ రెడ్డి తదితరులతో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రతినిధులు వీరికి ప్రత్యేక దర్శనం కల్పించి అలానే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 17, 2021 / 04:03 PM IST
    Follow us on

    Bala Krishna: మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం “అఖండ”. ఈ ఏడాది డిసెంబర్ 2న విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయ బేరి మోగించింది.ఈ సందర్భంగా తిరుమల వెంకన్న దర్శించుకున్నారు చిత్ర బృందం. “అఖండ” చిత్రానికి వేంకటేశ్వరస్వామి అఖండమైన విజయాన్ని చేకూర్చారు అని బాలయ్య తెలిపారు. బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను‌, నిర్మాత రవీందర్‌ రెడ్డి తదితరులతో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రతినిధులు వీరికి ప్రత్యేక దర్శనం కల్పించి అలానే లడ్డూప్రసాదాలు అందజేశారు.

    bala Krishna and boyapati visited tirumala venkateswara swamy

    Also Read: ‘ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు’ ఆల్​టైమ్​ రికార్డు సెట్​ చేసిన తారక్​

    దర్శనం అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ…  కరోనా వంటి పరిస్థితుల్లో విడుదలైన “అఖండ” చిత్రానికి ప్రేక్ష అభిమానులు బ్రహ్మరథం పట్టి గొప్ప విజయాన్ని అందించారని బాలయ్య సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సినిమా విజయం తెలుగు సినీ పరిశ్రమకు ఊపిరి పోసిందన్నారు అలానే ఎంతో మందికి ధైర్యాన్ని అందించిందని అన్నారు. ఆధ్యాత్మిక భావజాలంతో రూపొందించిన “అఖండ ” ను ఆదరించిన అన్నివర్గాల ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే పాత రోజులు గుర్తుకు వచ్చాయి అని అప్పట్లో తిరునాళ్లు, పౌరాణిక నాటకాలకు హాజరయ్యే రీతిలో “అఖండ” సినిమానూ ప్రేక్షకులు వీక్షించేందుకు భారీగా వచ్చారన్నారు. సినిమాకు విజయం సాధించిన నేపథ్యంలో లక్ష్మీ నరసింహ స్వామిని, కనకదుర్గమ్మ దర్శించుకున్నామని అలానే వేంకటేశ్వరస్వామి దర్శనం కూడా పూర్తి చేసు కున్నామన్నారు. మానవ ప్రయత్నంతో పాటు దైవానుగ్రహం ఉంటేనే ఇలాంటి విజయాలు అందుతాయని, ఈ క్రమంలోనే శ్రీవారిని దర్శించుకున్నట్టు తెలిపారు దర్శకుడు బోయపాటి, నిర్మాత రవీంద్ర. ప్రస్తుతం  డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు బాలకృష్ణ.

    Also Read: టాలీవుడ్ స్టార్స్ అందరూ ట్యూషన్ లో చేరండయ్యా..!