https://oktelugu.com/

స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ స్పీడ్ ను పెంచే ట్రిక్స్ ఇవే..?

దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. అయితే చాలామంది అత్యవసర సమయాల్లో స్లో ఇంటర్నెట్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. సిగ్నల్ బాగానే ఉన్నా ఇంటర్నెట్ స్పీడ్ గా రాకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే కొన్ని ట్రిక్స్ పాటించడం వల్ల సులభంగా స్లో ఇంటర్నెట్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. జియో రాకతో ప్రస్తుతం దేశంలోని ప్రజలకు తక్కువ ధరకే ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. Also Read: ఐఫోన్లు కొన్నవారికి గుడ్ న్యూస్.. ఫ్రీగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 13, 2020 / 08:21 PM IST
    Follow us on


    దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. అయితే చాలామంది అత్యవసర సమయాల్లో స్లో ఇంటర్నెట్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. సిగ్నల్ బాగానే ఉన్నా ఇంటర్నెట్ స్పీడ్ గా రాకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే కొన్ని ట్రిక్స్ పాటించడం వల్ల సులభంగా స్లో ఇంటర్నెట్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. జియో రాకతో ప్రస్తుతం దేశంలోని ప్రజలకు తక్కువ ధరకే ఇంటర్నెట్ అందుబాటులో ఉంది.

    Also Read: ఐఫోన్లు కొన్నవారికి గుడ్ న్యూస్.. ఫ్రీగా స్క్రీన్ల రీప్లేస్‌మెంట్..?

    అయితే యూజర్లు అంతకంతకూ పెరుగుతుండటం ఇంటర్నెట్ స్పీడ్ పై ప్రభావం చూపుతుండటంతో స్లో ఇంటర్నెట్ సమస్య ఎదురవుతోంది. 4జీ ఫోన్లు వాడుతున్నా 3జీ వేగంతోనే ఇంటర్నెట్ వస్తుందని చాలామంది వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. పెర్ఫామెన్స్ బూస్టింగ్ యాప్ లలో ఒకటైన క్లీన్ మాస్టర్ ఇంటర్నెట్ స్పీడ్ ను పెంచడంలో సహాయపడుతుంది. స్పీడ్ బూస్టర్ ర్యామ్ ను క్లియర్ చేసి వేగాన్ని పెంచుతుంది.

    Also Read: కస్టమర్లకు ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు..?

    ఈ రెండు యాప్స్ ను వినియోగించడం వల్ల స్మార్ట్ ఫోన్ పెర్ఫామెన్స్ మెరుగుపడటంతో పాటు ఇంటర్నెట్ వేగం పెరుగుతుంది. అయినప్పటికీ ఇంటర్నెట్ స్పీడ్ పెరగకపోతే నెట్వర్క్ సెట్టింగ్స్ చెక్ చేసుకోవాలి. నెట్వర్క్ సెట్టింగ్స్ లో 3జీలో ఉంటే వెంటనే మార్చుకోవాలి. గూగుల్ క్రోమ్, యూసీ బ్రౌజర్, ఓపెరా మినీ లాంటి ఫాస్ట్ వెబ్ బ్రౌజర్లను మాత్రమే మనం వినియోగించాలి.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఈ టిప్స్ పాటించడం ద్వారా ఇంటర్నెట్ వేగం ఖచ్చితంగా పెరుగుతుంది. ఆటో డౌన్ లోడ్ ను నిలిపివేయడం, నెట్వర్క్ సెట్టింగ్స్ ను రీసెట్ చేయడం, ఫోన్ యొక్క ఫ్లైట్ మోడ్ ను ఆన్ చేసి ఆఫ్ చేయడం, ఫోన్ ను రీస్టార్ట్ చేయడం, డేటా వినియోగాన్ని తనిఖీ చేయడం ద్వారా స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ ను పెంచుకోవచ్చు.