Vijayashanti Meets Sasikala: మాజీ ఎంపీ, తెలంగాణ బీజేపీ ప్రచారకమిటీ అధ్యక్షురాలు విజయశాంతి దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళతో సమావేశమయ్యారు. ఈ విషయంపై ప్రస్తుతం తమిళనాడులో జోరుగా చర్చ నడుస్తోంది. జైలు నుంచి విడుదలైన శశికళను విజయశాంతి ఎందుకు కలిశారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది రాజకీయ భేటినా లేక మర్యాదపూర్వక భేటీనా అని అక్కడి రాజకీయాల్లో పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నట్టు సమాచారం.

అంతకుముందు తమిళనాడులో ఓ విద్యార్థి ఆత్మహత్య వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ తరుణంలోనే విజయశాంతి బీజేపీ నేతలతో కలిసి అక్కడకు చేరుకున్నారు. తంజావురులో నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.అరియలూర్‌కు చెందిన విద్యార్థి తంజావూరులోని ప్యూర్ హార్ట్ హైస్కూల్లో చదువుతున్నాడు. అతను మతమార్పిడి ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులతో పాటు కొందరు ఆరోపిస్తున్నారు.
Also Read: నేరస్తులే నాయకులా? యూపీలో ఎక్కువ మంది నిందితులే అభ్యర్థులు?
దీంతో పాఠశాల యాజమాన్యంపై మతమార్పిడి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై బీజేపీ సీరియస్ అయ్యింది. బీజేపీ అధిష్టానం దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే విజయశాంతి బీజేపీ నేతలతో కలిసి అరియలూరు వడుగపాళయంలోని విద్యార్థి ఇంటికి వెళ్లి బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ఆఫీసుకు వెళ్లి బాలుడి ఆత్మహత్యపై సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కేసుపై సీబీఐ రంగంలోకి దిగడంతో కలెక్టర్ మాట్లాడేందుకు వెనుకంజ వేసినట్టు తెలిసింది. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని విజయశాంతి జిల్లా కలెక్టర్ ను డిమండ్ చేశారు.
ఆ తర్వాత అన్నాడీఎంకే పార్టీలో ఒకప్పుడు చురుకుగా పనిచేసిన శశికళను కలిశారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో జైలుకెళ్లి తిరిగొచ్చిన శశికళ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అన్నాడీఎంకే పార్టీకి కూడా ఆమె దూరం అయ్యారు. దీంతో బీజేపీలో చేరాలని విజయశాంతి ఆమెను కోరినట్టు వార్తలు వస్తున్నాయి. జయలలితకు నెచ్చెలిగా ఉన్న శశికళకు తమిళ రాజకీయాలపై మంచి పట్టుంది. స్టాలిన్ కేంద్రపై పదే పదే ఎదురు తిరుగుతుండటంతో ఆమెను బీజేపీలోకి ఆహ్వానించి అమ్మ సెంటిమెంట్‌తో తమిళనాడులో పాగా వేయాలని బీజేపీ చూస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: రాజ్యాంగంపై కేసీఆర్ మాటల్లో ఆంతర్యమేమిటి? వినోద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
[…] […]
[…] Asaduddin Owaisi: అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై ఉత్తరప్రదేశ్ లో కాల్పుల కలకలం సంచలనం రేపింది. దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరట్ లోని కితౌర్ లో ప్రచారం ముగించుకుని ఢిల్లీకి వెళ్తున్న క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారుపై ఆగంతకులు కాల్పులకు తెగబడటం తెలిసిందే. దీంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాల్పులకు పాల్పడింది ఎవరు? ఎందు కోసం చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనతో పాతబస్తీలో పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రత చర్యలు తీసుకున్నారు. […]