Megastar Chiranjeevi restarts : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘గాడ్‌ఫాదర్ , బోళాశంకర్’ చిత్రాలకు డేట్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8 నుంచి ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ లో చిరు పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. వారం రోజుల పాటు చిరంజీవి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. ఆ తర్వాత ‘భోళాశంకర్’ షూటింగ్ కు షిఫ్ట్ అవుతారని తెలుస్తోంది.

ముందుగా ప్లాన్ చేసిన షెడ్యూల్ చిరుకి కరోనా సోకడంతో కేన్సిల్ అయింది. ఇప్పుడు ఆయన రాకతో మళ్ళీ మొదలు కాబోతోంది. ఇక ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చివరి షెడ్యూల్ లో ఆయన జాయిన్ అవుతారట. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు.

కొరటాల శివతో ఆచార్య, మెహర్ రమేష్ తో ‘భోళా శంకర్’, మోహన్ రాజాతో ‘గాడ్ ఫాదర్‘, అలాగే బాబీతో మరో సినిమా, వెంకీ కుడుములతో మరో సినిమా.. ఇలా చిరు లిస్ట్ చాలా పెద్దగా ఉంది. అయితే, గాడ్ ఫాదర్’లో మెగాస్టార్ డీ గ్లామర్ లుక్ లో.. అదీ ఒక మాస్ లుక్ లో దాదాపు ఆరు ఏడు సీన్స్ లో కనిపించబోతున్నారు.