Also Read: మరో గొప్ప ప్రయత్నం చేస్తున్న సోనూసూద్
ఈ కేసులో రియా చక్రవర్తి అప్డేడ్ ను మీడియా ఎప్పటికప్పుడు వెల్లడిస్తోంది. రియా చక్రవర్తి తొలిరోజు జైల్లో గడిపిన విషయాలను జాతీయ మీడియా పెద్దఎత్తున ఫోకస్ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. రియా ప్రస్తుతం ముంబైలోని మహిళ జైల్లో ఉంది. మీడియా అక్కడి నుంచే రియా చక్రవర్తి తొలి రోజు జైల్లో ఎలా ఉంది.. ఏం చేసిది? అనే కథనాలను ప్రసారం చేసింది.
రియాకు జైలు అధికారులు తొలిరోజు చాప మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. కనీసం ఆమెకు దిండు కూడా ఇవ్వలేదని.. అదేవిధంగా ఆమె ఉన్న గదిలో ఫ్యాన్ కూడా లేదని పేర్కొన్నారు. రోజుకు రెండుసార్లు పాలు.. కరోనా సమయంలో ఇమ్యూనిటీ పెంచుకునేలా పండ్లు మాత్రం ఇస్తున్నారట. దీంతో ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కథనాలు ప్రసారమయ్యాయి. కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంటే మాత్రం ఆమె గదిలో టేబుల్ ఫ్యాన్ ఏర్పాటు చేస్తామని జైలు అధికారులు చెబుతున్నారట.
Also Read: పవన్, మహేష్ లను టార్గెట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్
ఈ కథనాలను ప్రసారం చేసిన మీడియాపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా మీడియా కేవలం రియా చక్రవర్తి జైలు జీవితంపై కథనాలు ఇవ్వడంపై మండిపడుతున్నారు. మీడియా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేవలం టీఆర్పీల కోసం సెలబ్రెటీలను టార్గెట్ చేయడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి కథనాలు వల్ల ఎవరికీ ఉపయోగం లేదంటున్నారు. గతంలో సుప్రీంకోర్టు సైతం రియా విషయంలో మీడియా చూపిస్తున్న అత్యుత్సాహంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా మీడియా తీరు మారకపోవడం శోచనీయంగా మారింది.