https://oktelugu.com/

కోవిడ్ బారిన పడిన విజయసాయి..

వైసీపీ ప్రభుత్వంలోని కీలక నేతలు ఓక్కోక్కరిగా కరోనా భారిన పడుతుండటం ఆ పార్టీ వర్గాలను కలవర పెడుతుంది. విజయనగరం, గుంటూరు, కర్నూలు జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే వైరస్ బారిన పడ్డారు. కొద్ది రోజుల కిందట డిప్యూటీ సిఎం అంజాద్ బాషా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. తాజాగా వైసీపీ ముఖ్యనేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి వైరస్ బారిన పడ్డారు. అయన వ్యక్తిగత సిబ్బందిలో ఒకరికి వైరస్ సోకిందని తెలిసింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికంగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 22, 2020 / 11:43 AM IST
    Follow us on


    వైసీపీ ప్రభుత్వంలోని కీలక నేతలు ఓక్కోక్కరిగా కరోనా భారిన పడుతుండటం ఆ పార్టీ వర్గాలను కలవర పెడుతుంది. విజయనగరం, గుంటూరు, కర్నూలు జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే వైరస్ బారిన పడ్డారు. కొద్ది రోజుల కిందట డిప్యూటీ సిఎం అంజాద్ బాషా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. తాజాగా వైసీపీ ముఖ్యనేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి వైరస్ బారిన పడ్డారు. అయన వ్యక్తిగత సిబ్బందిలో ఒకరికి వైరస్ సోకిందని తెలిసింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. రోజుకు 4 వేల నుంచి 5 వేల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.

    కరోనా విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వైఖరిని విపక్షాలు మొదటి నుంచి తప్పుబడుతున్నాయి. కేంద్రం లాక్ డౌన్ విధించిన సమయంలోను విజయసాయిరెడ్డి విశాఖ, అమరావతి, హైదరాబాదు, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో పర్యటించడంపై విమర్శలు వ్యక్తం చేశాయి. లాక్ డౌన్ నిబందలను విజయసాయికి వర్తించావా అని ప్రశ్నించాయి. నేషనల్ పర్మిట్ ఉన్న లారీలా తిరుగుతున్నారని సామాజిక మాధ్యమాల్లో విజయసాయికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. బయటకు వచ్చినప్పుడల్లా మాస్క్, చేతులకు గ్లౌస్ వేసుకుని కనిపించే విజయసాయికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కరోనా వైరస్ సోకింది.

    Also Read: బాబు ఆవేశానికి తమ్ముళ్లు బలి కావాల్సిందేనా?

    కరోనా పాజిటివ్ అని తెలియగానే విజయసాయిరెడ్డి ఆ పార్టీ ఇతర నేతల్లానే హైదరబాదుకు వెళ్లి అపోలో ఆసుపత్రిలో చేరారు. వైసీపీ ఎమ్మెల్యేలలో కొందరు, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, తదితరులు కరోనా సోకిన వెంటనే హైదరబాదుకు వెళ్లి అక్కడ ఆసుపత్రుల్లో చేరుతుండటం రాష్ట్ర ప్రజలకు విస్మయాన్ని కలుగుజేస్తుంది. రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చామని, కరోనాకు వైద్యం అదించడంలో రాష్ట్రం దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందని, రికవరీ రేటులో రాష్ట్రం ముందుందని ప్రకటిస్తున్న వైసీపీ నేతలు వైరస్ సోకగానే పోరుగు రాష్ట్రం హైదరాబాదు వెళ్లి వైద్యం చేయించుకోవడం విపక్షాలకు విమర్శలు చేసేందుకు అవకాశం ఇచ్చేలా ఉంది.

    Also Read: ఆరు నెలలు.. కాంగ్రెస్ ఆరు వైఫల్యాల కథ

    వైసీపీ కీలక నేత అయిన విజయసాయిరెడ్డికి కరోనా వైరస్ సోకడంతో ఆ పార్టీ ఉత్తరాంధ్ర, రాష్ట్ర కీలక నేతల్లో అందోళన మొదలయ్యింది. ఈ నెల 16వ తేదీన మొబైల్ కొవిడ్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా కరోనా పరీక్ష చేయించుకున్న విజయసాయికి నెగిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమరావతిలో పర్యటించారు. దీంతో ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు ఆందోళన చెందుతున్నారు.