https://oktelugu.com/

జగన్ పై కొత్త అస్త్రాన్ని ఎక్కుపెట్టిన ఎంపీ..

రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీపై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్టంరాజు తన స్వరాన్ని మరింత పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులపై పట్టుదలతో ముందుకు వెళుతున్న తరుణంలో అమరావతినే రాజధానిగా కోనసాగించాలని ఎంపీ రఘురామరాజు స్వయంగా రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయడం ఇప్పుడు రాష్ట్ర, జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లు సాధారణ విషయాలపైనే గళం విప్పిన రఘురామ రాజు ఇప్పడు కీలకమైన రాజధాని విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రపతికి వినతి పత్రాన్ని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 22, 2020 / 11:22 AM IST
    Follow us on


    రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీపై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్టంరాజు తన స్వరాన్ని మరింత పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులపై పట్టుదలతో ముందుకు వెళుతున్న తరుణంలో అమరావతినే రాజధానిగా కోనసాగించాలని ఎంపీ రఘురామరాజు స్వయంగా రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయడం ఇప్పుడు రాష్ట్ర, జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లు సాధారణ విషయాలపైనే గళం విప్పిన రఘురామ రాజు ఇప్పడు కీలకమైన రాజధాని విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రపతికి వినతి పత్రాన్ని సైతం సమర్పించి తన దూకుడు పెంచారు.

    Also Read: పవన్ దూకుడు పాలిటిక్స్ కి బ్రేక్?

    కేవలం రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లడంతోనే సరిపెట్టకుండా అమరావతినే రాజధానిగా కోనసాగించేందుకు ప్రజలు సహకరించాలని, రాజధానిని విశాఖ తరలించినా అమరావతినే కొనసాగించే వరకూ పోరాడి సాదించుకుందామని పిలుపునివ్వడం చూస్తుంటే… రఘురామ రాజు వైసీపీతో తాడో.. పేడో.. తేల్చుకునే వరకూ వచ్చరనే విషయం స్పష్టం అవుతుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసిన ఎంపీ మీడియాతో మాట్లాడారు. తనకు బధ్రత కల్పించే అంశంతోపాటు రాజధాని అమరావతి అంశంపైనే ఎక్కువ సమయం రాష్ట్రపతితో చర్చించడం జరిగిందని వెల్లడించారు. ఇన్నాళ్లు ముఖ్యమంత్రికి విధేయుడినని చెప్పిన రాఘురామరాజు రాజధాని విషయంలో స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపైనా విమర్శలు చేశారు.

    అమరావతి రాజధానికి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారని, తాను అమరావతిలో ఇల్లు కట్టుకున్నట్లు సిఎం జగన్ రాష్ట్ర ప్రజలను నమ్మించారని, చంద్రబాబుకు రాజధానిలో సొంత ఇల్లు లేదని పార్టీ నేతలు విమర్శలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ నగరాన్ని ఎంపిక చేసి అక్కడికి ఎప్పుడు వెళ్లిపోవాలా అని ఎదురు చూస్తున్నారని చెప్పారు. రాజధాని విషయంలో వైసీపీ పార్టీ, ప్రభుత్వం వైఖరి సరైంది కాదనే విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. అధికార పార్టీ ఏ సామాజిక వర్గంపై ఆరోపణలు చేస్తుందో ఆ సామాజకి వర్గం కంటే ఇతర సామాజికవర్గాలకు చెందిన రైతులే భూములు ఇచ్చిన వారిలో ఎక్కువ సంఖ్యలో ఉన్న విషయాన్ని రాష్ట్రపతికి వివరించినట్లు చెప్పారు.

    Also Read: ఢిల్లీలో విజయసాయి దుకాణం బంద్?

    ఒక వేళ మూడు రాజధానులు కోనసాగించాలని భావిస్తే అమరావతినే కార్యనిర్వాహక రాజధానిగా ఉంచాలని కొత్త డిమాండ్ లేవనెత్తారు. అయితే ఎంపీ రాఘురామరాజు బాటలో ఆ పార్టీ నుంచి మరికొందరు ప్రజాప్రతినిధులు ఎంపీకి మద్దతు పలికే అవకాశం ఉంటుందా అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. రాజధాని తరలింపుతో అమరావతి ప్రాంతానికి నష్టం జరుగుతున్నా ఇప్పటి వరకూ రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ నాయకులు ఎవరూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అయితే రాజధాని అంశాన్ని ఇన్నాళ్లు ప్రస్తావించని రఘురామరాజు ఇప్పడు చేసిన విమర్శలు, రాష్ట్రపతిని కలిసి వినతి ప్రతం సమర్పించిన వ్యవహారంపై పార్టీ నాయకులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.