ప్రభాస్ తరువాత అతనే.. పాన్ ఇండియా స్టార్ !

సీరియల్ యాక్టర్ నుండి స్టార్ హీరో కావడం అంటే.. అది సామాన్యమైన జర్నీ కాదు, బాలీవుడ్ లో షారుక్ లాంటి టాప్ స్టార్ ఉన్నా, సౌత్ ఇండస్ట్రీలో మాత్రం ఆ క్రెడిట్ ఒక్క కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కే దక్కుతుంది. ఒక బస్ డ్రైవర్ కొడుకుగా కెరీర్ స్టార్ట్ చేసిన యశ్, మొదట చాలా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాడు. అతను ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఏళ్ళ కష్టం ఉంది. అయితే యశ్ సినీ […]

Written By: admin, Updated On : July 22, 2020 12:08 pm
Follow us on


సీరియల్ యాక్టర్ నుండి స్టార్ హీరో కావడం అంటే.. అది సామాన్యమైన జర్నీ కాదు, బాలీవుడ్ లో షారుక్ లాంటి టాప్ స్టార్ ఉన్నా, సౌత్ ఇండస్ట్రీలో మాత్రం ఆ క్రెడిట్ ఒక్క కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కే దక్కుతుంది. ఒక బస్ డ్రైవర్ కొడుకుగా కెరీర్ స్టార్ట్ చేసిన యశ్, మొదట చాలా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాడు. అతను ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఏళ్ళ కష్టం ఉంది. అయితే యశ్ సినీ జర్నీ కేజీఎఫ్ తో పూర్తిగా మారిపోయింది. షార్ప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సృష్టించిన సంచలనాలు ఒక్కఎత్తు అయితే, యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఆ సినిమాలో యశ్ నటన మరో ఎత్తు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించి యశ్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది.

ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ తో యశ్ రేంజ్ మరింత పెరగబోతుందట, ప్రభాస్ తరువాత సౌత్ ఇండస్ట్రీ నుండి పాన్ ఇండియా స్టార్స్ నేమ్స్ లో యశ్ పేరే ఉంటుందని బాలీవుడ్ మీడియా కథనాలను రాస్తోంది. నిజానికి ఇప్పటివరకూ బాహుబలి తరువాత ఆ స్థాయిలో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమా కేజీఎఫ్ నే. ఇప్పుడు ప్రశాంత్ నీల్ పార్ట్ 1 కంటే భీభత్సమైన రీతిలో సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడని.. సినిమా బడ్జెట్ ను కూడా ఆ స్థాయిలొనే ఖర్చు పెడుతున్నాడని ఈ సినిమా గురించి బాలీవుడ్ మీడియా ప్రొజెట్ చేస్తుంది. పైగా ఈ సినిమాకి బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. అందుకు కారణం సినిమాలో విలన్ గా సంజయ్ దత్ నటిస్తుండటంతో ఈ సీక్వెల్ కి హిందీలో మంచి డిమాండ్ రావడానికి హెల్ప్ అయింది.

ఇక సంజయ్ దత్ కి సంబంధించిన పార్ట్ ను ఇప్పటికే షూట్ చేసి, ఎడిటింగ్ చేయడం కూడా పూర్తయిందని.. సంజయ్ దత్ సీన్స్ అన్ని అద్భుతంగా వచ్చాయని.. సినిమా మొత్తంలోనే అధీరా క్యారెక్టర్ యాక్షన్ కే హడల్ పుట్టించేలా సాగుతోందని తెలుస్తోంది. నిజంగానే సంజయ్ దత్ పాత్ర అంత అద్భుతంగా వస్తే.. కేజీఎఫ్ 2కు హిందీ జనం నీరాజనాలు పలకడం ఖాయం. అప్పుడు ఆ సినిమాకి వచ్చే అఖండ విజయం యశ్ ఖాతాలో పడుతుంది. అతన్ని పాన్ ఇండియా స్టార్ గా ప్రమోట్ అవుతాడు. మరి ఇవ్వన్నీ జరగాలంటే.. కరోనా తగ్గాలి, థియేటర్లు ఓపెన్ అవ్వాలి. ఇంతకీ కేజీఎఫ్ అంటే మీనింగ్.. కోలార్ బంగారు గ‌నులు. ఆ గ‌నుల‌ పై ప్ర‌పంచ మాఫియా క‌న్ను ఎలా ఉండేది అన్న‌ దానినే సినిమాగా చేస్తున్నారు. హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తోంది.