
Vijayasai Reddy on TDP: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ కార్యక్రమాలకు టీడీపీ అడ్డుపడుతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రభుత్వానికి అప్పులు రాకుండా బ్యాంకుల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా చేస్తోందని దుయ్యబట్టారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ పథకాలను అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. టీడీపీ కారణంగా పథకాలు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి దాపురించిందని అన్నారు. టీడీపీ నాయకుల విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయంగా వైసీపీని ఎదుర్కొనే దమ్ము లేకే పరోక్షంగా ఇలా ప్రవర్తిస్తోందని విమర్శించారు.
ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా అవి ప్రజలకు నేరుగా చేరుతుండడంతో ఇప్పటికైతే ప్రభుత్వానికి ఢోకా లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో కూడా వ్యతిరేకత కనిపించడం లేదని చెప్పారు. ఆర్థిక సమస్యలతో పథకాల అమలులో వేగం తగ్గినా ప్రజలు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వివరించారు. టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా చివరి విజయం తమదేనని చెబుతున్నారు. దీనిపై ఎలాంటి అభ్యంతరాలు లేవని పేర్కొన్నారు.
టీడీపీ వల్ల అప్పులు పుట్టడం లేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. పథకాలు మాత్రం ఆగడం లేదని చెప్పారు. టీడీపీ ఎంతగా అడ్డుకునే ప్రయత్నాలు చేసినా పథకాలు మాత్రం ఆగడం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు పథకాల చుట్టు తిరుగుతున్నాయని చెప్పారు. టీడీపీ విధానాలతో వైసీపీకి ఎంత మాత్రం నష్టం లేదని చెబుతున్నారు. టీడీపీ ఎంత ప్రయత్నించినా వైసీపీ ఎదుగుదలకు ఏ మాత్రం ప్రతిష్ట తగ్గదని చెప్పారు.
రాష్ర్టంలో ప్రస్తుతం వైసీపీ గాలి వీస్తున్నా ఎలా ఎదుర్కోవాలో తెలియక టీడీపీ అడ్డదారులు వెతుకుతోందని పేర్కొన్నారు. ప్రజల్లో వైసీపీకి ఇంకా వ్యతిరేకత రాలేదని వివరించారు. ఇప్పటికే టీడీపీ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజల వద్దకు వెళ్లలేని పార్టీ అధికార పార్టీపై లేనిపోని అబాండాలు వేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని దుయ్యబట్టారు.
రానున్న రోజుల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో ఇప్పటికే ప్రజల్లో గుర్తింపు వచ్చిందన్నారు. ఇన్నాళ్లు పార్టీ ఎదుగుదలలో ఎలాంటి తేడా లేదని చెప్పారు. టీడీపీ విమర్శలు చేస్తున్నా అవి మాకు ప్రయోజనమే చేకూరుస్తాయని పేర్కొన్నారు.