Homeఆంధ్రప్రదేశ్‌వెంకయ్యకు విజయసాయి క్షమాపణలు

వెంకయ్యకు విజయసాయి క్షమాపణలు

vijayasai venkaiah naidu
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి ఎట్టకేలకు రాజ్యసభలో క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో అనుచితంగా మాట్లాడినట్లు ఒప్పేసుకున్నారు. తప్పు చేశానని.. చింతిస్తున్నానని క్షమించాలని కోరారు. తాను రాజ్యసభ చైర్మన్‌ను అగౌరవ పరచాలనుకోలేదని చెప్పుకొచ్చారు. ఆయనపై తనకు చాలా గౌరవం ఉందన్నారు. మరోసారి ఇలాంటి పరిస్థితి రానివ్వనని హామీ ఇచ్చారు. తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించారు.

Also Read: కేసీఆర్ అన్నది రేవంత్, షర్మిల గురించేనా..?

వెంకయ్యపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపడంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి విజయసాయిరెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ట్విట్టర్‌లోనే కాదు సాక్షాత్తూ చట్టసభల్లోనూ విజయసాయిరెడ్డి ప్రతి ఒక్కరినీ తూలనాడుతూ ఉంటారు. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట టీడీపీ సభ్యుడు మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి నిబంధనల ప్రకారం కాకుండా.. మాట వరుసగా అడిగినందుకు తొలగించలేదని వెంకయ్యనాయుడుపై టీడీపీకి లింక్ పెట్టి విమర్శలు చేశారు. తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. ఆయన ప్రవర్తన చూసి రాజ్యసభలోని బీజేపీ సభ్యులే కాదు ఇతర పార్టీల నేతలు కూడా మండిపడ్డారు.

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిపై చర్య తీసుకోవాలని కోరారు. వెంకయ్యనాయుడు కూడా తనను పని చేయకుండా చేసేందుకు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి ప్రవర్తన రోజురోజుకూ దిగజారిపోతున్నారని.. ఆయనను చూసి మరికొందరు అలా చెడిపోయే ప్రమాదం ఉందని.. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ సర్వత్రా వినిపిస్తోంది. అందుకే.. విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పి ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.

Also Read: ఉక్కు ఉద్యమానికి టీడీపీ దూరం.. సడెన్ గా ఏమైంది..?

అందుకే.. ఆయన ఇంకో మాట కూడా మాట్లాడకుండా సారీ చెప్పేశారు. అయితే.. అనాల్సింది అంత ఆనేసి.. ఈ క్షమాపణలు కోరడం ఏంటని.. చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటి పరిస్థితి ఉండదని పలువురు సభ్యులు అంటున్నారు. ఇతర సభ్యులు గీత దాటకుండా తగిన పనిష్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య విజయసాయి రెడ్డి వివరణపై శాంతిస్తారా.. లేక చర్యలు తీసుకుంటారా చూడాలి మరి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular