ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడమంటే ఇదే.. 2014లో ఇటు కేసీఆర్.. అటు చంద్రబాబు గెలవగానే కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలను కాపీ కొట్టేవారు. రైతుబంధు నుంచి రైతు బీమా వరకు అన్నింటిని చంద్రబాబు మొదట కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టి హిట్ అయ్యాక ఏపీలోనూ పేరు మార్చి అమలు చేసేవారు.. కానీ 2019 ఎన్నికల్లో జగన్ గెలిచాక ట్రైన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు ప్రతీసారి జగన్ దూకుడుగా ముందుకెళ్తూ మొదట అమలు చేస్తుండగా.. అవి తెలంగాణ సీఎం కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేస్తున్నారు.
‘పాజిటీవ్’ కేసుల్లో తెలంగాణ టాప్.. కానీ?
తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు మించి ఏపీలో జగన్ అమలు చేయడం ఇక్కడి టీఆర్ఎస్ నేతలకు కంటగింపుగా మారింది. ప్రతీసారి జగన్ అక్కడ గొప్ప పథకాలు ప్రవేశపెట్టడం.. ఇక్కడ ప్రజలకు తెలిసి ఇక్కడ అమలు చేయాలని కోరడం తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఇరుకునపెడుతోంది.
నవరత్నాలు, ఇంగ్లీష్ మీడియం లాంటి పథకాలు తెలంగాణలో కూడా అమలు చేయాలని పలు సార్లు విలేకరులు కేసీఆర్ ను అడగ్గా.. అంతకంటే మంచి పథకాలు తెలంగాణలో ఉన్నాయని ఆయన బదులిచ్చాడు తప్పితే అమలు చేస్తానని అనలేదు.
కరోనా టైంలో సీఎం జగన్ బాగా దూకుడుగా చర్యలు తీసుకుంటూ అరికట్టేస్తున్నారు. కానీ తెలంగాణలో కేసీఆర్ పట్టించుకోకపోవడంతో ఆరోగ్యవ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. ఈ క్రమంలోనే పలువురు ప్రభుత్వ వైద్యశాలల్లో పరిస్థితిపై వీడియోలు రిలీజ్ చేసి తెలంగాణలో పరిస్థితిని కళ్లకు కట్టారు.
–
మంత్రి పదవీపై ఆశలు పెంచుకుంటున్న స్పీకర్..!
కరోనా తీవ్రత పెరగడంతో సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి దాన్ని తెచ్చి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సకు అవకాశం కల్పించారు. తెలంగాణలో అంతకంటే బాగా ప్రబలుతున్నా కేసీఆర్ చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేకపోవడంపై ఇప్పుడు విమర్శలు చెలరేగుతున్నాయి. సీఎం జగన్ ఏ ముహూర్తాన కరోనా చికిత్సలన్నింటిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాడో అప్పుడే తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఒత్తిడి మొదలైంది.కేసీఆర్ ఇంతటి కల్లోలం టైంలో తెలంగాణలో ఎందుకు ఇలా చేయడం లేదని అందరూ ప్రశ్నిస్తున్నారు.
ఇలా సమస్యలపై చురుకుగా స్పందిస్తూ ఏపీలో అమలు చేస్తున్న జగన్ దూకుడు వల్ల తెలంగాణ సీఎం కేసీఆర్ ఇరుకునపడుతున్నారు. ఏపీని పోల్చి చూస్తూ కేసీఆర్ ను చాలా మంది టార్గెట్ చేస్తున్నారు. అయితే ఎవ్వరు ఏమన్నా కానీ కేసీఆర్ మాత్రం సమస్యలపై పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది..