Homeఆంధ్రప్రదేశ్‌పిశాచంలా చంద్రబాబు.. విజయసాయి సంచలన పోస్టులు

పిశాచంలా చంద్రబాబు.. విజయసాయి సంచలన పోస్టులు

Vijaya Sai targeted Chandrababu వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. తెలుగు ప్రాంతాల మధ్య చోటుచేసుకున్న జల వివాదాలపై చంద్రబాబు పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. జలజగడం గురించి గోతికాడి నక్కలా కాచుకు కూర్చున్నాడని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ నేతలు పూటకో రకంగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. చేతనైతే సాయం చేయాలని కాని లేనిపోని అభాండాలు వేస్తూ చలికాచుకుంటున్న టీడీపీ నేతల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జలవివాదాలపై కేంద్రం చొరవ చూపి పరిష్కారం చేసేందుకు కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్లో మీడియా, టీడీపీ నేతల ఆరోపణలపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష హోదాలో ఉంటూ హుందాగా ప్రవర్తించాల్సింది పోయి చల్లర చేస్తున్నారని విమర్శించారు. వారి స్థాయికి తగినట్లుగా మాట్లాడాలని సూచించారు. జల వివాదాల సమస్యల్లో కేంద్రం జోక్యం చేసుకుని సమస్య పరిష్కరిస్తుందనే విశ్వాసం ఉందన్నారు. చంద్రబాబు ఆగడడాలపై త్వరలో చెక్ పెడతామని చెప్పారు.

ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో వేల కోట్లు ముడుపులు చేతులు మారాయని పేర్కొన్నారు. లోకేష్ బినామీ వేమూరి హరికృష్ణ అని తేల్చేశారు. టెరా సాఫ్ట్ సంస్తకు సెటాప్ బాక్సుల ధర రూ.1500 లు ఉండగా రూ.4000 గా నిర్ణయించి సుమారు రూ.2 వేల కోట్లు దారి మళ్లించారని వెల్లడించారు. దీనిపై సీఐడీ విచారణ చేపడితే నిజానిజాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఫైబర్ గ్రిడ్ పై విజయసాయిరెడ్డి పలు విషయాలు తెలుస్తాయని సూచించారు.

పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు నిలిపివేయాలని ప్రకాశం బ్యారేజీపై ధర్నాలు చేయించారని ధ్వజమెత్తారు. కృష్ణా డెల్టా ఎఢారే అవుతుందని దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. రెండేళ్లుగా రాష్ర్టం సుభిక్షంగా ఉండొద్దని కంకణం కట్టుకుని లేనిపోని ఆరోపణలు ఆపాదిస్తున్నాడని నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఏపీకి ఓ పిశాచంలా దాపురించారని అభివర్ణించారు. కరోనా మహమ్మారి కారణంగా సీఎం జగన్ ప్రజలకు దూరంగా ఉంటే దానిపై కూడా ప్రజలను తప్పుదారి పట్టించాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కరోనా తగ్గిన సందర్భంగా జిల్లాల పర్యటనకు సీఎం వెళ్లనున్నారని చెప్పారు.

ప్రతిపక్షాలు ఎంత అడ్డుకోవాలని ప్రయత్నాలు చేసినా సంక్షేమ పథకాల బాట ఆగదన్నారు. ప్రజల కోసం జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. అవసరమైతే ఎంతటి త్యాగానికైనా వెనుకాడబోమని ఉద్ఘాటించారు. సంక్షేమపథకాల అమలును స్వయంగా పరిశీలించేందుకు గ్రామసచివాలయాలను సందర్శించనున్నట్లు పేర్కొన్నారు. దమ్ముంటే ఆపాలని సవాల్ విసిరారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version