ఈ సినిమా నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో పూజ మద్యానికి బానిసైన తండ్రిని కాపాడుకునే కూతురి పాత్రలో అద్భుతంగా నటించింది. ఆమె నటనను మెచ్చుకుంటూ ఓ ప్రముఖ పత్రిక ఆమె గురించి స్పెషల్ కథనాలు రాసింది. ఈ సందర్భంగా పూజాభట్ ఆ ఛానల్ కు ఓ ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ క్రమంలో కొన్ని షాకింగ్ సంగతులు చెప్పుకొచ్చింది.
ఆ సంగతులు ఏమిటో పూజాభట్ మాటల్లోనే.. ‘ఈ సినిమా వచ్చి అప్పుడే ముప్పై ఏళ్ళు అయింది అంటే..నమ్మలేకపోతున్నాను. అందరికీ ఓ విషయం చెప్పాలి. నేను ఈ సినిమాలో విపరీతంగా మద్యం సేవించే తండ్రిని మార్చే కూతురు పాత్రలో నటించాను. మందు నుంచి తండ్రిని బయటక పడేసే కూతురి పాత్ర నాకు మంచి పేరు తీసుకువచ్చింది’ అని మౌనంలో నుండి మళ్ళీ తేరుకుని,
‘ఆ సినిమాలో తండ్రి మాదిరిగానే నేను కూడా నిజం జీవితంలో విపరీతంగా మద్యానికి బానిస అయ్యాను. ఎప్పుడూ మద్యమే సేవిస్తూ ఉండేదాన్ని. నా అలవాటు వల్ల నా కుటుంబం ఎంతో బాధ పడింది. నాకున్న ఆ అలవాటును చాలామంది మిస్ యూజ్ చేశారు. నా డ్రైవర్ తో సహా. అయితే నాలుగేళ్ల క్రితమే నేను తాగుడు అలవాటును మానేశాను. మద్యం ఆలోచల నుండి బయట పడటం అంటే ఒక పోరాటం అనే చెప్పాలి’ అని ఉన్నది ఉన్నట్లు చెప్పింది పూజాభట్.