Vijay political success strategy: ఒకప్పుడు రాజకీయాలు సిద్ధాంతాల ఆధారంగా సాగేవి. రాజకీయ నాయకులకు ప్రాంతాల మీద ప్రేమ ఉండేది. ప్రజల మీద ఆప్యాయత ఉండేది. రాజకీయాల మీద మక్కువ ఒక స్థాయి వరకే ఉండేది. అందువల్లే నాటి కాలంలో అభివృద్ధి కార్యక్రమాలలో అవినీతి అనేది అంతగా ఉండేది కాదు. బంధుప్రీతి కూడా తక్కువగా కనిపించేది. ఇప్పుడు అవినీతి పెరిగిపోయింది. బంధుప్రీతి అధికమైపోయింది. దోచుకోవాలని తాపత్రయం ఎక్కువైంది. కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకొస్తున్న ప్రాపకం తారస్థాయికి చేరుకుంది. అందువల్లే రాజకీయాలు అంటేనే ఒక వ్యాపారంగా మారిపోయింది. ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్ట్ లు రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత.. పాలిటిక్స్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒక రకంగా రాజకీయాలనేవి పెట్టుబడి పెట్టే భారీ వ్యాపారం లాగా మారిపోయాయి.
ప్రశాంత్ కిషోర్ ఇటీవల బీహార్ ఎన్నికల్లో జన్ సూరజ్ అనే పార్టీని స్థాపించారు. బీహార్ రాష్ట్రంలో ఆయన ఒక గేమ్ చేంజర్ అవుతారని అందరూ అంచనా వేశారు. కానీ ఒక స్థానాన్ని కూడా సాధించలేకపోయారు. దీంతో పీకే పని అయిపోయిందని.. ఇక ఆయన పెట్టే బేడా సర్దుకోవాలని సూచించారు. కానీ ప్రశాంత్ కిషోర్ బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా వ్యవహరించారు. తమిళనాడు ఎన్నికల్లో తన స్థాయిని చూపించారు.
విజయ్ తమిళనాడు ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించడం వెనక ఉన్నది త్రిష కాదు. ముమ్మాటికి ప్రశాంత్ కిషోర్. ఎందుకంటే విజయ్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. ఆమధ్య టీవీ కె పార్టీ సమావేశం జరిగినప్పుడు ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ” ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఐదు సందర్భాలలో కూడా చెన్నై జట్టుకు మహేంద్ర సింగ్ ధోని నాయకత్వం వహించారు. సీఎస్కేను ఐదుసార్లు విజేతగా నిలిపారు. ఇప్పుడు నేను కూడా విజయ్ పార్టీని తమిళనాడు ఎన్నికల్లో గెలిపిస్తాను. టీవీ కేను అధికారంలోకి తీసుకొస్తాను. విజయ్ ఎవరితోనో పొత్తు పెట్టుకోరు. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తారు. అత్యంత భారీ విజయం సాధిస్తారు” అని ప్రశాంత్ కిషోర్ ఆ వ్యాఖ్యలు చేశారు.
టీవీకే తమిళనాడు ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన మాటలను ఆ పార్టీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు.. విజయ్ విజయ వెనుక త్రిష కంటే ముందు ప్రశాంత్ కిషోర్ ఉన్నారు.. ఆయన అనేక రకాల వ్యూహాలు అమలు చేశారు. అవి తమిళనాడు రాజకీయాలలో వర్కౌట్ అయ్యాయి. అందువల్లే విజయ్ పార్టీ విజయం సాధించింది.. అతిపెద్ద పార్టీగా అవతరించి విజయ్ ని తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసింది. సాధారణంగా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ విచిత్రంగా ఉంటుంది. కానీ తమిళనాడు ఎన్నికల్లో ఈసారి స్లో పాయిజన్ లాగా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ సాగింది. అది విజయ్ పార్టీ విజయానికి దోహదం చేసిందని టీవీకే నేతలు అంటున్నారు.