Vijay Sai Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు రేపుతోంది. ఇందులో తమ రాజకీయ ప్రత్యర్థులే ఎక్కువగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం పట్టుబిగుస్తోంది. అసలు సూత్రధారి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గా చూపి.. పాత్రదారులుగా టీఆర్ఎస్ తో పాటు దాని అనుకూలంగా వ్యవహరించే వారిని చూపిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు అరబిందో గ్రూపు., అయితే ఈ గ్రూపునకు ఒక్క తెలంగాణ ప్రభుత్వంతోనే కాదు.. ఏపీ ప్రభుత్వంతోనూ లింకులు ఉన్నాయి. బహుశా అందుకే బీజేపీ కార్యకర్తలు స్కామ్ పునాదులు తెలంగాణాలో ఉన్నాయని.. అవి ఏపీ రాజధానిలోని తాడేపల్లి వరకూ విస్తరించాయని ఆరోపణలు చేస్తూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే అరబిందో గ్రూపు ప్రధాన పాత్ర తేలడం.. అది వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి సమీప బంధువుది కావడంతో నాటి అనుమానాలు నిజమవుతూ వస్తున్నాయి. విజయసాయిరెడ్డి అల్లుడిదిగా భావిస్తున్న అరబిందో గ్రూపు ఇప్పుడు స్కామ్ లో నిండా కూరుకుపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.

అరబిందో గ్రూపునకు ఉచ్చు..
ఈ లిక్కర్ స్కామ్ తో అటు ఢిల్లీ, ఇటు తెలంగాణ ప్రభుత్వాలను బదనం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకే ఆ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు స్కామ్ పై రకరకాల పోస్టులు పెడుతున్నారు. వాటినే ట్రోల్ చేస్తున్నారు. మొత్తం స్కామ్ గురించి వివరిస్తున్నారు. కేజ్రీవాల్ సర్కారు ఏ విధంగా అవినీతికి పాల్పడింది వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అందులొ లింకులన్నీ ఒక్కొక్కటీ బయటపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో అరబిందో గ్రూపు పేరు బయటపడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో ఇది విజయసాయిరెడ్డికి కలవరపాటుకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ స్కాం నుంచి అరబిందో గ్రూపును బయటపడేసేందుకు విజయసాయిరెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ విజయసాయిరెడ్డి విన్నపాలను మన్నించే స్థితిలో బీజేపీ పెద్దలు లేరు. ఒకవేళ విజయసాయిరెడ్డిపై సానుకూలత చూపితే కేజ్రీవాల్ ను విడిచిపెట్టాల్సి ఉంటుంది. విజయసాయిరెడ్డి గురించి కేజ్రీవాల్ ను విడచిపెట్టే గోల్డెన్ చాన్స్ ను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోదు.
కీలక నేత సైలెంట్…
అయితే ఇటీవల విజయసాయిరెడ్డి అనూహ్యంగా సైలెంట్ అయ్యారు. మీడియాకు కూడా దొరకడం లేదు. దీనికి ఈ లిక్కర్ స్కామే కారణమని తెలుస్తోంది. తన అల్లుడుకు చెందిన అరబిందో గ్రూపు చుట్టూ ఉచ్చు బిగుస్తుండడంతో ఆయనలో కలవరపాటుకు గురైంది. అందుకే ఆయన తెగ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. అయిన దానికి..కానిదానికి చంద్రబాబు, లోకేష్ లపై ట్విట్టర్ లోవిరుచుకుపడే ఆయన ఐదు రోజులుగా పూర్తిగా ట్విట్లు చేయడమే మానేశారు. కానీ ప్రధాని మోదీని మాత్రం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. హిందీ, ఇంగ్టీష్ లో ట్విట్లు పెడుతున్నారు. తెలుగు భాష జోలికి కానీ.. చంద్రబాబు, లోకేష్ ల ప్రస్తావనలేవీ చేయడం లేదు. ఇప్పుడు ఆయన ముందున్న కర్తవ్యం. అల్లుడుకు చెందిన అరబిందో గ్రూపును బయటపడేయ్యడమే. ఆ ప్రయత్నాల్లోనే ఆయన బిజీగా ఉన్నారు.
[…] […]