CM Vijay Career Journey: బంతిని ఎంత గట్టిగా కొడితే అది అంత పైకి లేస్తుంది. రాయిని ఎంత వేగంగా విసిరితే అంతే వేగంతో కిందికి వస్తుంది. విజయ్ కూడా అంతే.. ఎంత దారుణంగా అయితే మాటలు పడ్డాడో.. ఎందరి నోటి నుంచి అయితే విమర్శలు ఎదుర్కొన్నాడో.. అందరికీ అంతే స్థాయిలో సమాధానం చెప్పాడు.. ఇళయ దళపతి నుంచి మొదలుపెడితే సీఎం విజయ్ వరకు అతని ప్రస్థానం చాలా గొప్పది. అలాగని గొప్పగా సాగలేదు. పడి లేచిన తర్వాత నిలబడ్డాడు. ఇప్పుడు స్థిరపడ్డాడు. సోమవారం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జన్మదిన నేపథ్యంలో.. అతడి సినిమా ప్రయాణం.. రాజకీయ ప్రయాణం గురించి ప్రత్యేక కథనం..
సినిమాలోకి వచ్చేముందు విజయ్ ని చాలామంది విమర్శించారు. అతడికి నటన రాదు అన్నారు. బండ మొహం అన్నారు. నల్లగా ఉంటాడని ఎగతాళి చేశారు. నీకు సినిమాలో నటించడం రాదు గాని వెళ్ళిపో అన్న వాళ్ళు కూడా ఉన్నారు.. తొలి సినిమా నాళయ తీర్పు అట్టర్ ఫ్లాఫ్. ఈ సినిమాను విజయ్ తండ్రి చంద్రశేఖర్ నిర్మించారు. భారీగా నష్టపోయారు. ఆ తర్వాత సినిమాను విజయ స్నేహితులు నిర్మించారు. కెప్టెన్ విజయ్ కాంత్ అందులో గెస్ట్ రోల్ ప్లే చేశారు. ఆ సినిమా పేరు సింధూర పాండి. ఇది సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత విజయ్ రేంజ్ మారిపోయింది. రసిగన్ అనే సినిమాతో తనకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. వరుసగా సూపర్ హిట్ సినిమాలో నటించి తిరుగులేని స్టార్‌గా ఎదిగిపోయారు.
2009లో విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేశారు. దీనిద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత తమిళగ వెట్రి కళగం పేరుతో 2024 ఫిబ్రవరిలో పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీని తమిళ ప్రజలకు చేరువ చేశారు. 2026 ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించారు. అంతేకాదు.. ఐయూఎంఎల్.. కాంగ్రెస్.. కమ్యూనిస్టు పార్టీల సహకారంతో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
తమిళనాడు ఎన్నికల్లో వినూత్నమైన ప్రచారాన్ని నిర్వహించారు. గంటల తరబడి ప్రసంగాలు చేయలేదు. అధికారం కోసం కోట్లు పంచలేదు. ఉచిత హామీలు ఇవ్వలేదు. తమిళనాడులో వినూత్నమైన ప్రచారం చేసి.. పెద్ద పెద్ద పార్టీల సైతం సాధ్యం కాని విధంగా తమిళ ప్రజల అభిమానాన్ని చురగొన్నారు ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తున్నారు.. వినూత్నమైన పథకాలు.. గ్రామ స్వరాజ్యం కోసం ఆయన వేగంగా అడుగులు వేస్తున్నారు.. తమిళ రాజకీయాల్లో ఎంతమంది నాయకులు వచ్చారు.. వెళ్లారు. కానీ విజయ్ ప్రస్థానం మాత్రం చాలా విభిన్నమైనది. ఎందుకంటే ఆయనకు ఎటువంటి నేపథ్యం లేదు. ఎవరి సపోర్ట్ లేదు. రాజకీయాల్లోకి వచ్చి నిలబడ్డాడు. అదికూడా ద్రావిడ వాదం లేకుండానే ఎన్నికల్లో గెలిచారంటే మామూలు విషయం కాదు.
