Venu Swamy On Jagan: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినీ, రాజకీయ రంగ ప్రముఖుల భవిష్యత్ గురించి ఇట్టే జ్యోతిష్యం చెబుతుంటారు. యూట్యూబ్ వీడియోల ద్వారా జ్యోతిష్యం చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ప్రధానంగా సెలబ్రిటీల భవితవ్యాన్ని చెబుతూ ఆకట్టుకుంటారు. తాజాగా ఆయన చెబుతున్న జ్యోతిష్యం వీడియో ఒకటి వైరల్ గా మారింది. సీఎం జగన్ పదవీకాలం పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవే అంతటా చర్చనీయాంశంగా మారాయి.
ఏపీలో తాను ఏకధాటిగా 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటానని జగన్ చాలా సందర్భాల్లో ప్రకటించారు. అది సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. కానీ అది నిజమేనంటున్నారు వేణు స్వామి. దానిని చిన్న లాజిక్ తో చెప్పుకొచ్చారాయన. జగన్ కు తిట్టే వారు ఉన్నంతవరకు ఆయనే సీఎం అంటూ ప్రకటించేశారు. విపక్ష నాయకులు, వ్యతిరేకించే మీడియా వల్లే సీఎం జగన్ గెలుపునకు డోకా ఉండదని తేల్చి చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి మరి.
ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు, పవన్ తో పాటు ఎల్లో మీడియా ఉంది. అందుకే జగన్ ప్రత్యర్థులతోపాటు వ్యతిరేక మీడియాను దుష్టచతుష్టయంతో పోల్చుతుంటారు. రాజకీయంగా చంద్రబాబు,పవన్ జగన్ పై విరుచుకుపడుతుంటారు.ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహా టీవీ తదితర మీడియా వ్యతిరేక ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తుంటాయి. తెల్లారి లేచింది మొదలు ప్రభుత్వ వ్యతిరేక కథనాలే ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో కనిపిస్తుంటాయి. అయితే ఇలా ప్రచారం చేసినన్నాళ్లు జగన్కు తిరిగి ఉండదాని తాజాగా వేణు స్వామి జోస్యం చెప్పారు. అయితే ఆయన జోష్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో జగన్ జాతకం బాగా లేదని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కేవలం ప్రత్యర్థుల తిట్ల దండకం వల్లే జగన్ లాంగ్ టర్న్ సీఎం అవుతాడని వేణు స్వామి చెబుతుండడం విస్మయ పరుస్తోంది. సోషల్ మీడియాలో సైతం రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.