Vemuri Radhakrishna: నరేంద్ర మోడీని గొప్ప నాయకుడిగా అభిమానించాడు. ఇందిరాగాంధీని ఐరన్ లేడీ అని పేర్కొన్నాడు. మొత్తంగా తెలుగు వాసనలు లేకుండా.. ఈ ఆదివారం కొత్త పలుకులో ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఒకసారి జాతీయవాది అయిపోయాడు. శత్రు దేశాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని, మావోయిస్టుల విధానాన్ని, ఎల్టిటిఈ ప్రభాకరన్ చేసిన ఆత్మహుతి పద్ధతిని..ఖలిస్తాన్ వేర్పాటు వాదాన్ని రాధాకృష్ణ ఏకీపారేశాడు. తన జర్నలిజంలో ఉండే బ్యూటీ.. చంద్రబాబు ప్రస్తావన లేకుంటే.. జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలనే అవసరం లేకుంటే రాధాకృష్ణ రెచ్చిపోతాడు. తన పెన్ పవర్ తో అద్భుతంగా రాస్తాడు. ఓకే టెంపోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దుమ్ము రేపి వదిలిపెడతాడు. కానీ ఎప్పుడైతే పసుపు రంగు కనబడితే బ్రేక్ తీసుకుంటాడు. ఒక్కసారిగా పసుపు కార్యకర్త అవతారం ఎత్తుతాడు. అదే అతనిలో ఉండే పెద్ద మైనస్. అఫ్కోర్స్ వ్యక్తిగతంగా అతనికి ప్లస్ కూడా.
Also Read: సీజ్‌ఫైర్ వద్ద: పాక్ తో ’భారత్ యుద్ధమే కావాలి
ఇంకా ఏం రాశాడంటే..
బంగ్లాదేశ్ ఏర్పాటు.. దానికంటే ముందు పాకిస్తాన్ దేశంతో చేసిన యుద్ధం.. చైనాతో చేసిన యుద్ధం వల్ల ఓడిపోయిన తీరు.. ఒకప్పుడు మనదేశ ఆర్థిక పరిస్థితి.. ఇప్పుడు ఎదిగిన విధానం అన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి ఏకరువు పెట్టుకుంటూ రాధాకృష్ణ వచ్చాడు. ఉగ్రవాదులు స్వర్గం కోసం పాకులాడుతారని.. దానికోసం హింసకు తెగబడతారని.. హింసకు పాల్పడితే స్వర్గం లభిస్తుందని ఏ మత గ్రంథం చెప్పిందని రాధాకృష్ణ ప్రశ్నించాడు.. పుణ్య కార్యాలు చేస్తేనే స్వర్గం ప్రాప్తిస్తుందని హితబోధ పలికాడు. ఎక్కడ ఉన్న స్వర్గం కోసం.. ఉగ్రవాదులు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడటం దారుణమని రాధాకృష్ణ లెక్చర్ ఇచ్చాడు. ఉగ్రవాదులు తమ తీరు మార్చుకోవాలని హితబోధ పలికాడు. పాకిస్తాన్ భారత్ గనుక కలిసిపోతే ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతాయని వ్యాఖ్యానించాడు. ఈ లెవెల్లో చెప్పిన రాధాకృష్ణ.. కరోనా సమయంలో తన సంస్థలో పనిచేసిన ఉద్యోగులను తొలగించి పాపం ఎందుకు మూట కట్టుకున్నాడు? అంతంత మాత్రం వేతనాలు ఉన్న ఉద్యోగులను తొలగించి పాపాత్ముడు ఎందుకు అయ్యాడు.. నాటి కరోనా పీడ దినాలలో ఉద్యోగులకు ఇచ్చిందే సగం వేతనం కదా.. కొద్దిరోజులు ఉద్యోగులను అలానే ఉంచుకుంటే.. వారికి కూడా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు కదా.. మరి ఉద్యోగులను తొలగించి పాపాలను మూట కట్టుకున్న రాధాకృష్ణ.. ఇప్పుడు ఉగ్రవాదులకు పుణ్యాత్ములుగా మారమని క్లాస్ పీకడం ఏంటి.. నిజంగా నాడు ఉద్యోగాలు కోల్పోయిన డెస్క్ జర్నలిస్టులు ఎంతగా ఇబ్బంది పడి ఉంటారో.. మార్కెటింగ్ సిబ్బంది ఎంతలా ఆవేదన చెంది ఉంటారు. రాధాకృష్ణ ఎప్పుడైనా ఊహించి ఉంటాడా.. కనీసం వారి విషయంలో ఉదారత చూపి ఉంటాడా.. ఏంటో చెప్పడానికే నీతులు ఉంటాయి కాబోలు.. వాటిని ఆచరించాలంటే ఎవరికైనా కష్టమే.