Pawan Kalyan- Vehicles: విజయ దశమి నాడు తిరుపతి నుంచి మొదలయ్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త యాత్రకు రంగం సిద్ధమైంది. ఎనిమిది బ్లాక్ కలర్ స్కార్పియోలు మంగళగిరిగిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు.
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. ఏపీలో జనసేన బలోపేతమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించారు. జనసేనాని పర్యటనకు ఈ వాహనాలు వినియోగించనున్నారు. వీటికి పూజ కార్యక్రమాలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారని పార్టీ నేతలు తెలిపారు.
Also Read: KCR BRS Party: కేసీఆర్ ‘బిఆర్ఎస్’.. ఉండవల్లి, పవన్ కళ్యాణ్ కు బాధ్యతలు?
అక్టోబర్ 5న దసరా రోజున తిరుపతి నుంచి ప్రారంభించి ఆరునెలల్లోనే రాష్ట్రమంతా పవన్ కల్యాన్ పర్యటిస్తారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు జనసేన నేతలు పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటనలు ఉండేలా రూట్ మ్యాప్ రూపొందిస్తున్నారు.
రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఎదుర్కొనేందుకు వీలుగా ఈ పర్యటనలు ఉండేలా రూట్ మ్యాప్ రూపొందిస్తున్నారు. జనసైనికులు సిద్ధంగా ఉండాలని పరా్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉంటాయనే సంకేతాలు వస్తున్నందున జనసేనాని పవన్ కళ్యాణ్ స్పీడు పెంచారు. దసరాలోపు తాను ఒప్పుకున్న సినిమా షూటింగ్ లను పవన్ కళ్యాణ్ పూర్తి చేయనున్నారు.
Also Read:AP MPs: కండోమ్ రెడ్డి, విగ్ రాజా.. ఛీఛీ.. దిగజారిపోయిన ఏపీ ఎంపీలు!