Nani- Ante Sundaraniki Collections: అంటే సుందరానికీ కలెక్షన్స్ ఆశాజనకంగా లేవు. కీలకమైన వీకెండ్ ముగియగా అతి తక్కువ వసూళ్లు మాత్రమే దక్కాయి. అంటే సుందరానికీ మూవీ మూడు రోజులకు గానూ రూ. 14.95 కోట్ల వరల్డ్ వైడ్ షేర్, రూ. 26.25 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే అందుకుంది. ఏపీ/తెలంగాణాలలో అంటే సుందరానికీ చిత్రం రూ. 10.4 కోట్ల షేర్ అందుకుంది. రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన అంటే సుందరానికీ చిత్ర బ్రేక్ ఈవెన్ రూ. 31 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ ద్వారా నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో చిత్ర యూనిట్ ఉంది. హీరో నాని, హీరోయిన్ నజ్రియాతో పాటు చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మంచి సినిమాను మీడియా సప్పోర్ట్ చేయాలి. మేము మా సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. ఇక్కడ మేము నంబర్స్ సెలబ్రేట్ చేసుకోవడం లేదు, ప్రేక్షకుల ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా సినిమా బ్లాక్ బస్టరా? కదా? అనే విషయం కాలమే నిర్ణయిస్తుంది అంటూ… నాని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. సినిమా టాక్ కి వసూళ్లకు సంబంధం లేదన్న ఆవేదన ఆయన మాటల్లో కనిపించింది. ఇక మూవీ గురించి మంచిగా రాసి మీడియా ప్రోత్సహించాలని ఆయన పరోక్షంగా తెలియజేశారు.
Also Read: Insult To Balayya: పుట్టినరోజు నాడు బాలయ్య కి ఘోరమైన అవమానం
నిజంగా అంటే సుందరానికీ చిత్ర వసూళ్లు అనూహ్యం. నాని గత చిత్రం శ్యామ్ సింగరాయ్ అతి తక్కువ టికెట్స్ ధరలతో కూడా నాలుగు కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టింది. అప్పటి టికెట్స్ ధరలతో పోల్చుకుంటే అంటే సుందరానికీ టికెట్స్ ధరలు చాలా ఎక్కువ. ఏపీలో వంద రూపాయలు తక్కువ టికెట్ ధర ఎక్కడా లేదు. అంటే సుందరానికీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని ఇలాంటి వసూళ్లు రాబట్టడం ఆశ్చర్యం కలిస్తుంది.

దర్శకుడు వివేక్ ఆత్రేయ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా అంటే సుందరానికీ తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా నజ్రియా హీరోయిన్ గా నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. నరేష్, నదియా, రోహిణి కీలక రోల్స్ చేశారు. ఇక సినిమా ఫలితంతో సంబంధం లేకుండా నాని భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే సుందరానికీ చిత్రానికి నాని ఎప్పుడూ లేని విధంగా రూ. 15 కోట్లు తీసుకున్నారనే టాక్ వినిపిస్తుంది.
Also Read:Anushka Shetty Brother: అనుష్క శెట్టి సోదరుడికి ప్రాణభయం
[…] […]